Advertisementt

అమ్మో.. సమంత మామూలుది కాదండోయ్

Thu 29th Oct 2020 01:04 PM
samantha,bigg boss 4,host,remuneration,2 crores,nagarjuna  అమ్మో.. సమంత మామూలుది కాదండోయ్
Remuneration to Samantha for Bigg Boss Host అమ్మో.. సమంత మామూలుది కాదండోయ్
Advertisement
Ads by CJ

తెలుగులో బిగ్ బాస్ అంటే ఎన్టీఆర్, నాని, గత రెండు సీజన్స్ హోస్ట్ చేస్తున్న నాగార్జునలు. కానీ గత సీజన్ లో నాగ్ బర్త్‌డేకి విదేశాలకు వెళ్లగా రమ్యకృష్ణ ఓ రెండు ఎపిసోడ్స్ ని హోస్ట్ చేసింది. ఇక నాగార్జున శని, ఆదివారాలు హోస్టింగ్ కి టీఆర్పీస్ కానీ, క్రేజ్ కానీ విపరీతంగా ఉంటుంది. అయితే తాజా సీజన్‌లోను నాగార్జున తన బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పాడు. తన వైల్డ్ డాగ్ షూటింగ్‌లో భాగంగా కులుమనాలి వెళ్లిన నాగ్ తన స్థానంలోకి ఆయన కోడలు సమంతని తీసుకొచ్చాడు. మరి అక్కినేని కోడలు, టాప్ హీరోయిన్, యంగ్ హీరో భార్య సమంత బిగ్ బాస్ హోస్ట్ అంటే ఎంత క్రేజు, ఎంత హైప్.

అంతే హైప్‌ని గత రెండు రోజులుగా మా స్టార్ గంట గంటకి క్రియేట్ చేస్తూనే ఉంది. శనివారం నాగ్ - సమంత కూడా లేకుండా నార్మల్ గా సాగిన బిగ్ బాస్.. దసరా ఆదివారం ఎపిసోడ్‌ని మూడున్నర గంటల లాంగ్ ఎపిసోడ్‌ని ప్రసారం చేసింది. ఇక హోస్ట్‌గా నాగ్ కోడలు సమంతని పరిచయం చేసి తప్పుకోగా సమంత ఎంతో అనుభవం ఉన్న యాంకర్ గా బిగ్ బాస్ స్టేజ్ పై అదరగొట్టేసింది. పట్టు చీర కట్టుకుని.. మెడలో బంగారు ఆభరణలో అక్కినేని కోడలు సమంత మెరిసిపోయింది. మరిది అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పబ్లిసిటితో పాటుగా... జబర్దస్త్ ఆదితో హౌస్ మేట్స్ తో ఆటలు, పాటలు, డాన్స్ లు, మధ్యలో బిగ్ బాస్ స్టేజ్ మీద కార్తికేయ డాన్స్, పాయల్ అందాలు... మధ్య మధ్యలో ఎలిమినేషన్ నుండి సేవ్ చెయ్యడం అబ్బో సమంత అదరగొట్టేసింది.

ఇక సమంత - అరియనా, అఖిల్ - మోనాల్ ని, అభిజిత్, అవినాష్, నోయెల్ లను సేవ్ చెయ్యగా.. చివరికి దివి ఎలిమినేట్ అయ్యి సమంతతో బిగ్ బాస్ స్టేజ్ మీదకెక్కింది. తక్కువ టైంలోనే లాస్య మీద బిగ్ బాంబు వేసి సమంతతో సెల్ఫీ దిగి దివి ఇంటికెళ్ళిపోగా.. ఈ వారం ఒకే ఒక్క భారీ ఎపిసోడ్ ని అదరగొట్టిన సమంత.. ఈ ఒక్క ఎపిసోడ్ తో పాటుగా.. వచ్చే రెండు ఎపిసోడ్స్ కి భారీ పారితోషకం అందుకుందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. నాగార్జున సీజన్ మొత్తానికి 8  కోట్లు అందుకుంటే.. సమంతకి రెండు మూడు ఎపిసోడ్స్‌కే 2 కోట్లకి పైగా ఇస్తున్నారనే టాక్ అందరిని షేక్ చేస్తుంది. మొదటి ఎపిసోడ్ మూడున్నర గంటలు ప్లాన్ చెయ్యగా.. తర్వాత గంటన్నర ఎపిసోడ్‌కి కలిపి సమంతకి ఏకంగా 2 కోట్లకు పైగానే స్టార్ మా ముట్టజెబుతుందట. 

Remuneration to Samantha for Bigg Boss Host:

Samantha bags Crores for Bigg Boss show host

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ