ప్రముఖ దర్శకులు వంద సినిమాలు తెరకెక్కించిన దర్శక దిగ్గజం కె రాఘవేంద్ర రావు గారు తాజాగా పెళ్ళి సందడి సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా అప్పట్లో వచ్చిన పెళ్ళిసందడి ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు. కీరవాణి సంగీతం, హీరోయిన్ల అందచందాలు, రాఘవేంద్ర రావు దర్శకత్వం మొదలగు అన్నీ కలిసి పెళ్ళి సందడి సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసాయి.
ఐతే చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా అనౌన్స్ చేసిన రాఘవేంద్రరావు గారు పెళ్ళి సందడి అనే టైటిల్ తో రావడం అందరిలో ఆసక్తి కలిగించింది. ఐతే సినిమా అనౌన్స్ చేసారు కానీ హీరో ఎవరనేది వెల్లడి చేయలేదు. తాజాగా ఈ సినిమా హీరోని ఇంట్రడ్యూస్ చేసారు. ఆ పెళ్ళి సందడి సినిమాలో హీరోగా చేసిన శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ ఈ పెళ్ళి సందడిలో సందడి చేయనున్నాడు. ఈ మేరకు అధికారికంగా సమాచారం బయటకి వచ్చింది.
గతంలో రోషన్ హీరోగా నిర్మలా కాన్వెంట్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా ప్రభావం చూపలేదు. ఐతే అప్పుడు రోషన్ మరీ చిన్నపిల్లాడు. ఇప్పుడు పెళ్ళిసందడి సినిమాకి సరిపోయేంతలా మారాడు. మరి రోషన్ తో తెరకెక్కిస్తున్న ఈ పెళ్ళిసందడి ఏ లెవెల్ లో హిట్ అవుతుందో చూడాలి. ఐతే ఈ సినిమాకి రాఘవేంద్రరావు గారు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారట. డైరెక్టర్ గా గౌరీ రోనంకి చేస్తున్నారు.