బాలకృష్ణతో సెట్ అయినట్టుగా బోయపాటికి మరే హీరోతోనూ సెట్ కాలేదేమో. కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు భధ్ర లాంటి సాలిడ్ యాక్షన్ మూవీస్ చేసిన బోయపాటి బాలయ్యతో చేసిన సింహా, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టి మాస్ డైరెక్టర్ అయ్యాడు. కానీ మరే హీరోతోనూ అంత పెద్ద హిట్స్ కొట్టలేకపోయాడు బోయపాటి. అయితే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ కన్నా ముందే బోయపాటికి చిరుతో సినిమా చెయ్యాలని ఉండడమే కాదు.. ఆ సినిమా ప్రకటన కూడా వచ్చింది. అయితే తర్వాత వినయ విధేయ రామ అట్టర్ ప్లాప్ కావడంతో కథ మొత్తం మారిపోయింది. బోయపాటితో రెండు భారీ హిట్స్ కొట్టిన బాలయ్యే రెండేళ్ల గ్యాప్ తో అవకాశం ఇచ్చాడు.
మళ్ళీ చిరు అవకాశం అంటారా. అది ఇప్పట్లో జరిగే పని కాదు. ఎందుకంటే చిరు వరసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. సైరా తర్వాత బోయపాటితో చిరు సినిమా ఉంటుంది అనుకుంటే.. చిరంజీవి కొరటాలతో కమిట్ అయ్యాడు. తర్వాత బోయపాటి దూరడానికి కూడా సందు లేకుండా రీమేక్స్ మీద దృష్టి పెట్టడమే కాదు... ప్లాప్ దర్శకులకు వరస అవకాశాలు ఇస్తున్నాడు.
కానీ బోయపాటికి అవకాశం ఇవ్వడం లేదు. మరి బాలయ్య సినిమా తర్వాత అయినా చిరుతో సినిమా చెయ్యాలని బోయపాటి ఆలోచన. మరి చిరు నుండి పిలుపు కోసం బోయపాటి ఇప్పటివరకు వెయిట్ చెయ్యాలో ఏమిటో.