ప్రభాస్ పుట్టిన రోజు వచ్చింది... రాధేశ్యామ్ హడావిడి సోషల్ మీడియాలో దున్నేసింది. ప్రభాస్ విక్రమాదిత్య వింటేజ్ లుక్, పూజాహెగ్డేతో ట్రైన్‌లో రొమాంటిక్ లుక్ తో ప్రభాస్ రాధేశ్యామ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. రాధేశ్యామ్ టీం ఇప్పటివరకు సైలెంట్ గా ఉంది. ఇక ప్రభాస్ పుట్టిన రోజు నుండి సినిమాపై క్రేజ్ పెంచాలనే టీం ఆలోచన పర్ఫెక్ట్ గా సక్సెస్ అయినట్లుగానే కనబడుతుంది. ఇక ప్రభాస్ పుట్టిన రోజునాడు మరో ఇద్దరు దర్శకులు ప్రభాస్ ఫ్యాన్స్‌ని మోసం చేశారు. వాళ్ళే నాగ్ అశ్విన్, ఓంరౌత్ లు. వాళ్ళేం.. మోసం చేశారంటారా..
నాగ అశ్విన్ సినిమా ప్రభాస్ తో అనౌన్స్ చేశాక కొన్ని రోజులకే దీపికా పదుకొనేని హీరోయిన్ గా పరిచయం చేశాడు. అలాగే ప్రభాస్ పుట్టిన రోజు కన్నా ముందే అంటే ఓ వారం ముందే ప్రభాస్ - దీపికా కాంబోలో నాగ అశ్విన్ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లుగా ప్రకటించి.. పుట్టిన రోజునాడు ఎలాంటి అప్ డేట్ లేకుండా ఉసూరుమనిపించాడు. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ కూడా ప్రభాస్ తో ఆదిపురుష్ ని హడావిడిగా గ్రాండ్ గా ప్రకటించాడు. అలాగే కొన్ని రోజుల్లోనే ఆదిపురుష్ లో విలన్ గా సైఫ్ అలీఖాన్‌ని పరిచయం చేశాడు. కానీ ప్రభాస్ పుట్టిన రోజునాడు ఓంరౌత్ ఆదిపురుష్ అప్ డేట్ ఇస్తాడేమో.. హీరోయిన్ ని ఏమైనా పరిచయం చేస్తాడేమో అని అనుకుంటే.. ఓంరౌత్ కూడా ఫ్యాన్స్ కి హ్యాండ్ ఇచ్చాడు.
ఇక ప్రభాస్ పుట్టిన రోజునాడు.. ఓంరౌత్, నాగ్ అశ్విన్ లు ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా సింపుల్ గా ప్రభాస్ కి విషెస్ చెప్పి తప్పించుకున్నారు. మరి వాళ్ళది కూడా ఏం తప్పులేదు. ఫ్యాన్స్‌ని కావాలని మోసం చెయ్యలేదు. నాగ్ అశ్విన్ కానీ ఓంరౌత్ కానీ ప్రభాస్ తో సినిమా షూటింగ్స్ మొదలు పెట్టకుండా ఆ సినిమా ఫస్ట్ లుక్ కానీ. టీజర్ కానీ, నాగ అశ్విన్ టైటిల్ కానీ చెప్పలేరు. అందుకే ప్రభాస్ పుట్టిన రోజునాడు ఆ ఇద్దరు దర్శకులు ప్రభాస్ లుక్స్ ని విడుదల చెయ్యలేకపోయారంతే.