RX 100 లో బోల్డ్‌గా నటించిన నాటినుంచి ఆఫర్స్ పట్టేసిన పాయల్ రాజపుత్.. స్టార్ అవకాశాలు కోసం ఎదురు చూస్తుంది. కానీ స్టార్ హీరోలెవరు పాయల్ రాజపుత్‌ని దగ్గరకి రానివ్వడం లేదు. ఆఖరుకి రవితేజ, వెంకటేష్‌ల పక్కన నటించినా ఈ బోల్డ్ బ్యూటికి అవకాశాలు అనుకున్నట్టుగా లేవు. అయినా తన ప్రయత్నాలు మానని పాయల్ రాజపుత్ సడన్‌గా వెయిట్ లాస్ అయ్యింది. మరీ బొద్దుగా కాకపోయినా.. హైట్‌కి సరిపడా వెయిట్ తో కళకళలాడే పాయల్ రాజపుత్ ఈ మధ్యన తాను సన్నబడిన ఫొటోస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫొటోస్ చూశాక పాయల్ రాజపుత్ అవకాశాల కోసం బాగా కష్టపడుతుంది. అమ్మాయి మేకోవర్ అదుర్స్. అయినా మొన్నటివరకు కాస్త బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మ ఇలా ఎలా బరువు తగ్గింది. పాయల్ రాజపుత్ బరువు తగ్గడం వెనుక ఉన్న రహస్యం ఏమిటా అని అందరూ తెగ చర్చించేసుకుంటున్నారు. అయితే తాజాగా తన బరువుపై పాయల్ రాజపుత్ స్పందించింది.
అది తాను నటిస్తున్న ఓ తెలుగు సినిమా కోసం ఇలా బరువు తగ్గాల్సి వచ్చింది అని.. కన్నడ రీమేక్ గా తెరకెక్కనున్న ఆ సినిమాలో పాయల్ పేదరికంలో కొట్టుమిట్టాడే పాత్ర చేస్తుందట. ఆ పాత్ర కోసమే ఇలా బరువు తగ్గాల్సి వచ్చింది అని.. అయినా తెలుగు సినిమాలు చేస్తున్నప్పటి నుండి డైట్ లో బాగా స్ట్రిక్ట్ గా ఉంది బరువు తగ్గిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.