కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. లాక్‌డౌన్.. లాక్‌డౌన్.... అంతా లాక్‌డౌన్. ఇక కరోనా కంట్రోల్ కావడం లేదని ఎవరి షూటింగ్స్ వారు మొదలు పెట్టేసుకున్నారు. RRR, రాధేశ్యామ్, ఇంకా చాలా సినిమాల షూటింగ్స్, అలాగే బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా మొదలైపోయిన వేళ విజయ్ - పూరి జగన్నాథ్‌ల ఫైటర్ కూడా ముంబైలో మొదలు కాబోతుంది అనే అనుకున్నారు. కానీ ఇక్కడ అంటే ముంబైలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది అని.. చాలామంది పోలీసులకు కరోనా సోకింది అని.. ముంబైలో రోజువారీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు విజయ్ షూటింగ్ ఆగినా ఆగొచ్చని అంటున్నారు.
ఇక విజయ్ దేవరకొండ కూడా కరోనా ఎక్కువగా ఉంది.. అప్పుడే ఎందుకులే అంటున్నాడని టాక్. మరోపక్క విదేశీ ఫైటర్స్ కూడా ముంబైకి రావాల్సి ఉండగా.. అదీ ఆలస్యం జరగడంతో పూరి - విజయ్ దేవరకొండ చివరికి నవంబర్ కూడా వదిలేసి డిసెంబర్ నుండే సెట్స్‌కి వెళ్లేలా కనబడుతుంది వ్యవహారం. కరోనాకి ముందు ముంబై పరిసర ప్రాంతాల్లో గ్యాప్ లేకుండా 45 రోజులపాటు భారీ షెడ్యూల్ చేసింది చిత్ర బృందం.
పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు కానీ.... ఫైటర్ టైటిల్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే పూరి జగన్నాథ్ కూడా విజయ్ దేవరకొండ చెప్పినట్టుగా నవంబర్‌లో కాకుండా డిసెంబర్‌లోనే ఫైటర్ షూటింగ్ మొదలు పెడదామని అనుకుంటున్నాడట.