Advertisementt

ఇది సునీల్ పరిస్థితి..?

Mon 26th Oct 2020 12:56 PM
sunil,comedian,tollywood,remuneration,colour photo movie  ఇది సునీల్ పరిస్థితి..?
This is the Sunil Situation in Tollywood ఇది సునీల్ పరిస్థితి..?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సునీల్ కెరీర్ డోలాయమానంలో ఉంది. కమెడియన్‌గా సూపర్ ఫామ్‌లో ఉన్న సునీల్ హీరో వేషాలు వేసి చేతులు కాల్చుకున్నాడు. హీరోగా ఒకటి రెండు సినిమాలే హిట్. మిగతా హీరోగా చేసిన సినిమాలన్నీ ప్లాప్. అయినా సునీల్‌కి హీరోయిజం మీద మోజు తగ్గలేదు. హీరోగా ఫెయిల్ అయ్యి కమెడియన్ అవతారమెత్తాక కూడా మళ్ళీ హీరోగా సినిమా చేస్తున్నాడంటే సునీల్‌కి హీరోయిజం మీద మోజు వదలడం లేదనేది అర్థమవుతుంది. సరే అదలా ఉంటే సునీల్ కమెడియన్‌గానూ ఫామ్‌లోకి రాలేకపోతున్నాడు. ఏ సినిమా హిట్ అయినా అందులో సునీల్ ఉన్న సునీల్ పాత్ర మరుగున పడుతుందే కానీ హైలెట్ అవడం లేదు.

అయితే తాజాగా సునీల్ సుహాస్ హీరోగా తెరకెక్కిన కలర్ ఫోటో సినిమాలో పోలీస్ పాత్రలో నెగెటివ్ రోల్ చేశాడు. ఈ సినిమా ‘లో’ బడ్జెట్ మూవీ, చిన్న సినిమా. అయితే ఈ సినిమాకి సునీల్ కాల్షీట్స్ కూడా తక్కువే. జస్ట్ తొమ్మిది రోజులే సునీల్ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చాడు. అలానే ఆ తొమ్మిదిరోజుల కోసం సునీల్ తీసుకున్న పారితోషకం చూస్తే మరీ ఇంత చీపా అనేస్తారు. మరీ సునీల్ కలర్ ఫోటో కోసం తొమ్మిదిరోజులు అందుకున్న పారితోషకం జస్ట్ 10 లక్షలేనట. అంటే రోజుకి లక్ష చొప్పున అన్నమాట. మరీ సునీల్ రేంజ్ కి ఇది తక్కువే. కాకపోతే కలర్ ఫోటో బడ్జెట్‌ని బట్టి సునీల్ కూడా ఓ మెట్టు దిగి ఉంటాడు. ఒకప్పుడు కమెడియన్ గా ఒక్కో సినిమాకి 2 నుండి 3 కోట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి అప్పుడు సునీల్ క్రేజ్ అలాంటిది. కానీ ఇప్పుడు సునీల్ క్రేజ్ అంతలేదు.. ఛాన్స్ వస్తే చాలు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి.

This is the Sunil Situation in Tollywood:

Sunil remuneation for Colour Photo Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ