రాజమౌళి నీరు - నిప్పు అంటూ ఎన్టీఆర్ - రామ్ చరణ్ పాత్రలను RRR ఫస్ట్ లుక్ లో చెప్పినట్టుగా రామ్ చరణ్ ని మండే అగ్ని గోళంలా అల్లూరి సీతారామరాజుగా చూపించాడు. ఇక ఎన్టీఆర్‌ని జలపాతం అంటే నీరుగా చూపించడానికి ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు పెద్ద పరీక్షే పెట్టాడు. కరోనా వలన ఎన్టీఆర్ భీం వీడియో ఆయన పుట్టిన రోజున విడుదల చెయ్యలేకపోయాడు జక్కన్న. కరోనా వలన షూటింగ్ కి బ్రేకులు పడడంతో.. మళ్లీ షూటింగ్ మొదలు పెట్టిన వెంటనే భీం వీడియో వదులుతామని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చెయ్యడమే కాదు.... గత ఐదు రోజులుగా ఎన్టీఆర్ కొమరం భీం వీడియోపై అందరిలో ఆసక్తి, క్రేజ్, హైప్ పెంచేశారు. ఇక నిన్న బుధవారం నుండి RRR హీరోల మధ్యన ట్విట్టర్ సంభాషణ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేస్తోంది. వెయిటింగ్ రామరాజు ఫర్ భీం అంటూ రాజమౌళి అందరిని వెయిట్ చేయించేశాడు. ఇక ఎన్నో నెలల నిరీక్షణకు జక్కన్న తాజాగా తెరదించాడు.
కొమరం భీం ఎన్టీఆర్ బయటికి వచ్చాడు. అన్న అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో కొమరం భీం నీటిని చీల్చుకుంటూ దట్టమైన అడవుల మధ్యన అదిరిపోయే కండలు చూపిస్తూ.. చేస్తున్న కసరత్తులు RRR కే హైలెట్ అనేలా ఉంది. అల్లూరి తన తమ్ముడు భీం ని పరిచయం చేస్తూ.. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి..నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయ్..వాడి పొగరు ఎగిరే జెండా..వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమరం భీం అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ కేరెక్టర్ భీం ని పరిచయం చేసాడు చరణ్. నిజంగా ఎన్టీఆర్ మేకోవర్‌కి ఫ్యాన్స్ కి పూనకాలే. బల్లెం విసిరితే అగ్ని కూడా చెల్లచెదురు అవడం హైలెట్ అనేలా ఉంది. జక్కన్న ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తాడో అనే క్యూరియాసిటీని క్షణాల్లో మాయం చేసేసాడు జక్కన్న. ఎన్టీఆర్ ఉగ్ర రూపానికి మన్యం ప్రజలే కాదు.... యావత్ ఇండియా సలాం కొట్టాల్సిందే.