Advertisementt

జబర్థస్త్ టీమ్ లీడర్‌కి కరోనా.. వారి పరిస్థితేంటి?

Sun 25th Oct 2020 10:27 AM
jabardasth,sudigali sudheer,corona positive,jabardasth team,rashmi  జబర్థస్త్ టీమ్ లీడర్‌కి కరోనా.. వారి పరిస్థితేంటి?
Corona Positive to Jabardasth Team Leader జబర్థస్త్ టీమ్ లీడర్‌కి కరోనా.. వారి పరిస్థితేంటి?
Advertisement
Ads by CJ

కరోనాతో ఒకప్పుడు జనాలు, నేతలు ఒణికిపోయినా.. ఇప్పుడు కరోనాకి పెద్దగా కంగారు పడడం లేదు. కరోనాతో సహజీవనం చేయాలని ఏపీ సీఎం జగన్ చెప్పినట్టుగా ఇప్పుడు నిజంగానే జనాలంతా కరోనాతో సహజీవనానికి సిద్దమై రోడ్డెక్కారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక సినిమా షూటింగ్స్, సీరియల్స్ షూటింగ్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ షూటింగ్స్‌తో సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామందికి కరోనా వస్తుంది పోతుంది. కొంతమందిని తనతో తీసుకుపోతుంది కూడా. రాజమౌళి లాంటి దర్శక దిగ్గజమే కరోనా బారిన పడ్డాడు. ఇక ఇండస్ట్రీలో చాలామందికి కరోనా వచ్చింది పోయింది. అయితే తాజాగా జబర్దస్త్ టీం లీడర్ సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడ్డాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

సుడిగాలి సుధీర్‌కి కరోనా సోకింది అని, ప్రస్తుతం అతను హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సుధీర్‌తో కలిసి చాలామంది పని చేస్తున్నారు. ఢీ లో ప్రదీప్, రష్మీ, ఆది, వర్షిణిలు, జబర్దస్త్ లో శ్రీను, ఆటో రామ్ ప్రసాదులు ఉన్నారు. అలాగే స్పెషల్ ప్రోగ్రాంలో కూడా సుధీర్ అందరితో కలిసి పని చేసాడు. మరి ఇప్పుడు సుధీర్ కి కరోనా అంటే మిగతా వారికీ కంగారు పుడుతుంది అంటే అందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందే. అయితే సుధీర్ కరోనా విషయంపై ఆయన టీం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే సుధీర్‌తో పాటు రష్మీకి కూడా కరోనా సోకిందా అనే అనుమానంలో ఆమె అభిమానులు ఉన్నారు.

Corona Positive to Jabardasth Team Leader:

Corona: Tension in Jabardasth Team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ