జబర్దస్త్‌లో ఆడుతూ పాడుతూ కామెడీ చేసి అందరిని నవ్వించే ముక్కు అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోను తన కామెడీ పంచ్ లతో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అవినాష్.. అక్కడి మిగతా కంటెస్టెంట్స్ తో మంచి వాడు అనిపించుకుంటూ.. నాగార్జున దగ్గర కామెడీగా మార్కులు కొట్టేస్తున్నాడు. తన కామెడీతో హౌస్ సభ్యులను తన చుట్టూ చేర్చుకున్న అవినాష్ మొదటిసారి ఎలిమినేషన్స్‌లోకి వచ్చాడు. ఈ సోమవారం అవినాష్‌కి సోహైల్‌కి మధ్యన నామినేషన్ జరగగా అందులో అవినాష్ నామినేట్ అయ్యాడు. అయితే సాదా సీదాగా కనబడే అవినాష్ కి కామెడీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. కానీ అవినాష్ మాత్రం ఈ నామినేషన్స్ విషయంలో కాస్త భయపడుతున్నాడు.
ఓపెన్‌గానే మేము ఏమేమి అవదలుచుకుని బిగ్ బాస్ లోకి వచ్చామో తెలుసా? మాకు బయట చాలా పనులు ఉన్నాయి.. కానీ ఈ హౌస్ లోకి ఎందుకొచ్చామో తెలుసా అంటూ మాట్లాడుతున్నాడు. ఇక సోహైల్ కూడా తనకు ఓటు వేసే ప్రతి ఒక్కరిని అవినాష్‌కి ఓట్ చెయ్యమని చెప్పాడు. అయితే ఇప్పుడు బయట అవినాష్‌కి ఉన్న అండ చూస్తే నిజంగా షాకవ్వాలి. అవినాష్‌ని ఎలిమినేట్ అవకుండా తప్పించడానికి జబర్దస్త్ సభ్యులు అంతా కదులుతున్నారు.
ఇప్పటికే రాకింగ్ రాకేష్ తన సోషల్ మీడియాలో అవినాష్ కి ఓట్స్ వేయాలంటూ ఉద్యమానికి తెర లేపాడు. జబర్దస్త్ టీం మొత్తంగా అవినాష్ వెనకనే ఉందని అర్ధమవుతుంది. మరి అభిజిత్, మోనాల్, అరియనా, నోయెల్ కి ఒక వర్గం ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు. కాని అవినాష్‌కి జబర్దస్త్ టీం మొత్తం ఉండడమే కాదు.. జబర్దస్త్ ప్రేక్షకులు కూడా అవినాష్ ని సేవ్ చెయ్యడం పక్కాగా కనబడుతుంది వ్యవహారం.