పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మొదలు వరుసబెట్టి సినిమాలు ఒప్పేసుకున్నాడు. కరోనా లేకపోతే గనుక పవన్ తన వకీల్ సాబ్‌ని థియేటర్స్‌లో దింపడమే కాదు... క్రిష్ సినిమాని ఓ కొలిక్కి తెచ్చేసేవాడే. పాపం కరోనా పవన్ ప్లానింగ్‌ని తారుమారు చేసింది. పవన్ ఐడియాస్, ప్లాన్స్ అన్ని దెబ్బకొట్టేశాయి. వకీల్ సాబ్ షూట్ ఇంకా మిగిలే ఉంది. ఇక క్రిష్ సినిమా మొదలవ్వాలి. తర్వాత హరీష్ శంకర్ సినిమా తదుపరి సురేందర్ రెడ్డి సినిమా. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడంటే దర్శకులంతా పరుగులు పెట్టాల్సిందే. పవన్ షెడ్యూల్ ప్రకారం దర్శకులు షూటింగ్ షెడ్యూల్ పెట్టుకోవాల్సిందే.
అయితే సురేందర్ రెడ్డి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ అనే మలయాళ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ తో పాటుగా రానా ఈ రీమేక్ లో నటించబోతున్నాడని న్యూస్ సోషల్ మీడియాలో మాములుగా చక్కర్లు కొట్టలేదు. పవన్ కళ్యాణ్ డాలి డైరెక్షన్ లో ఈ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ చేస్తాడేమో అనే న్యూస్ నడిచింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ మలయాళ రీమేక్ చెయ్యడం లేదని తెలుస్తుంది. ఈ సినిమాపై పవన్ కి ఆసక్తి లేదని.. అయితే ఈ రీమేక్ లో రవితేజనే నటిస్తాడని, రవితేజ - రానా కాంబోలోనే అయ్యప్పన్ కోషియమ్ ఉండబోతుంది అనే టాక్ ముందు నుండి ఉన్నదే. ఇప్పడు అదే నిజం అంటున్నారు.