Advertisementt

పవన్ ఫ్యాన్స్ ఎందుకు వర్రీ అవుతున్నారు?

Wed 21st Oct 2020 09:57 PM
pawan kalyan,power star,fitness,pawan kalyan fans,worry  పవన్ ఫ్యాన్స్ ఎందుకు వర్రీ అవుతున్నారు?
Pawan Kalyan fans worry about His Fitness పవన్ ఫ్యాన్స్ ఎందుకు వర్రీ అవుతున్నారు?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక ఫిట్‌నెస్ గురించి వదిలేసాడు. పెరిగిన గెడ్డం, లాల్చీ, పైజామా, పంచె కట్టుతో పెద్దమనిషిలా తయారయ్యాడు. సినిమా హీరో నుండి పూర్తి రాజకీయనాయకుడు స్టయిల్లోకి మారిపోయాడు. రాజకీయ నాయకుడిగా స్టయిల్ అయితే మార్చాడు కానీ.. రాజకీయాల్లో సక్సెస్ అవలేక సతమతమవుతున్నాడు. ప్రస్తుతం సినిమాలు కూడా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫిట్‌నెస్ మీద చాలారకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పవన్ ఇలా ఉంటే హీరోగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. పవన్ కళ్యాణ్ ఫిట్‌గా ఉండాలి... అప్పుడే హీరోయిజం పండుతుంది అంటూ కామెంట్స్ చెయ్యడమే కాదు.. పవన్ ఫ్యాన్స్ ఆయన ఫిట్‌నెస్ విషయంలో తెగ వర్రీ అవుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరోయిజం చూపించడానికి రెడీగా లేడట. అంటే పవన్ కళ్యాణ్ తాను చెయ్యబోయే సినిమాల్లో మిడిలేజ్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. అందుకే దర్శకులతో తన వయసుకు తగిన పాత్రలతో ఉన్న కథలనే సినిమాలుగా చేద్దామని ముందే చెప్పేశాడట. అందుకేనేమో పవన్ కళ్యాణ్ అంతగా ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టడం లేదట. జిమ్‌లో వర్కౌట్స్ చేసి సన్నగా హీరోలా తయారై మళ్ళీ యాక్షన్, హీరోయిజం అంటే బావుండదని పవన్ ఫీలింగ్ అయ్యుండొచ్చు. అందుకే తన వయసుకు తగ్గ పాత్రలకు సరిపోయే కథలనే ఎంచుకుంటున్నాడు. జనవరిలో కూడా రాజకీయాల నుండి ఎటువంటి హడావిడి లేకుండా వకీల్ సాబ్ షూట్‌లో జాయిన్ అయ్యాడు. లాయర్‌గా మిడిల్ ఏజ్ వ్యక్తిలా ఎలా కనిపించినా ఓకె కదా అందుకే పవన్ ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టడం లేదు. 

Pawan Kalyan fans worry about His Fitness :

Pawan Kalyan not fit for movie shootings

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ