Advertisementt

విజయ్ - సుక్కు సినిమా నేపథ్యమిదేనట!

Tue 20th Oct 2020 09:55 PM
vijay deverakonda,sukumar,movie,latest,update  విజయ్ - సుక్కు సినిమా నేపథ్యమిదేనట!
This is the vijay deverakonda and sukumar movie concept విజయ్ - సుక్కు సినిమా నేపథ్యమిదేనట!
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాల గురించి మాట్లాడుకుంటున్న సమయంలో.. సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమాని పాన్ ఇండియా లెవల్లో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీ ఎనౌన్సమెంట్ రావడం అందరికి షాకిచ్చింది. కనీసం గాసిప్ లో కూడా లేని కాంబో అవడంతో వారి కాంబోలో మూవీ అనగానే నిజంగా అందరూ షాకయ్యారు. అయితే ఎలాగూ సుక్కు పుష్పని, విజయ్ ఫైటర్ పూర్తి చేశాక సుక్కు - విజయ్ సినిమా ఉంటుంది కాబట్టి ఆ సినిమాపై ప్రస్తుతం పెద్దగా సోషల్ మీడియాలో గాసిప్స్ కానీ, న్యూస్ లు కానీ వినిపించడం లేదు.

అయితే తాజాగా సుకుమార్ - విజయ్ దేవరకొండ సినిమా నేపథ్యం దేశభక్తితో కూడుకున్నదని..  పాకిస్తాన్ – ఇండియా విడిపోయిన కాలంలో జరిగిన పరిస్థితుల ఆధారంగా జరిగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

పాకిస్తాన్ - ఇండియాకి మధ్యన జరిగిన యుద్ధంలో ఇండియాని గెలిపంచడానికి తన శాయశక్తులా పోరాడిన ఓ జవాను కథగా వీరి సినిమా ఉండబోతుంది అంటున్నారు. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ నటులే కనిపిస్తారని అంటున్నారు. 

This is the vijay deverakonda and sukumar movie concept:

vijay deverakonda and sukumar movie latest update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ