హీరోయిన్స్ కి సినిమాలు లేవా అని అడిగినా... ఏంటి పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగినా... కాదు మీరు ఎవరితోనైనా లవ్ లో ఉన్నారా అని అడిగినా వెంటనే కోపమొచ్చేస్తుంది. తెగ ఫైర్ అయ్యిపోతారు. మరి సెలెబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు తరుచు ఎదురవుతూనే ఉంటాయి. వాటికీ ఓపిగ్గా సమాధానం అవుననో కాదనో చెబితే ఓకే.. లేదంటే ఆ హీరోయిన్స్ నెటిజెన్స్ చేతికి అడ్డంగా దొరుకుతారు. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి అభిమానులతో చిట్ చాట్ చేసే క్రమంలో తనని అడిగిన ప్రశ్నలకు కోపం తెచ్చుకుని ఆ నెటిజెన్స్ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. అది కూడా తన చేతి ఉంగరం చూసిన ఓ అభిమాని మీకు నిశ్చితార్ధం అయ్యిందా అని అడిగినందుకు.
అభిమానులతో చిట్ చాట్ చేసే క్రమంలో లావణ్య త్రిపాఠి చేతికి ఉన్న ఓ ఉంగరం చూసిన ఓ అభిమాని మీకు నిశ్చితార్ధం అయ్యిందా అని అడగగానే.. ఆడవాళ్లు, అమ్మాయిల చేతికి ఉంగరం చూడగానే ఎంగేజ్మెంట్ అయ్యినట్టేనా? అమ్మాయిలు ఉంగరాలు వేసుకోకూడదా? ఆ ఉంగరం నా సొంత డబ్బుతో కొనుక్కున్నాను, అది నాకు నేను ఇచ్చుకున్న కానుక అంటూ ఫైర్ అయ్యింది. అంతేకాకుండా పెళ్ళెప్పుడు అనే ప్రశ్నకు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది ఈ బ్యూటీ. పెళ్లి విషయం ఇప్పటివరకు మా అమ్మానాన్నలే నన్ను అడగలేదు.... నీకెందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరి కెరీర్ ఊగిసలాటలో ఉన్న హీరోయిన్ కి ఇలాంటి ప్రశ్నలు వేస్తే అంత మంటెక్కితే.. కెరీర్ పీక్స్ లో ఉన్న హీరోయిన్స్ ని అలాంటి ప్రశ్న వేస్తే ఇంకెంత ఫైర్ అవుతారో మరి.