Advertisementt

చిరు చెల్లిగా.. సాయిపల్లవి కాదంట!

Sun 18th Oct 2020 01:16 PM
chiranjeevi,vedalam remake,keerthi suresh,sister role  చిరు చెల్లిగా.. సాయిపల్లవి కాదంట!
Who is Chiranjeevi sister in vedalam remake చిరు చెల్లిగా.. సాయిపల్లవి కాదంట!
Advertisement
Ads by CJ

చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు. చిరు ఎప్పుడొస్తాడో అని కొరటాల వెయిటింగ్. అయితే చిరు ఆచార్య తర్వాత మెహెర్ రమేష్‌తో తమిళ వేదాళం రీమేక్ చేయబోతున్నాడు. ఇప్పటికే వేదాళం రీమేక్ స్క్రిప్ట్ పూర్తయ్యింది అని... చిరు అందులో మార్పులేమి చెప్పలేదని, కానీ బడ్జెట్ తగ్గించి సినిమా చెయ్యమని మాత్రం మెహెర్‌కి సలహా ఇచ్చాడనే న్యూస్ నడుస్తుంది. అయితే ఈ వేదాళం రీమేక్ కోసం చిరంజీవి గుండుతో ఫోటో షూట్ కూడా చేయించుకున్నాడు. ఇక ఈ రీమేక్‌లో చిరుకి చెల్లెలిగా సాయి పల్లవి నటించబోతుంది అనే న్యూస్ నడిచింది. అయితే యూనిట్ నుండి కానీ, సాయి పల్లవి నుండి కానీ స్పష్టత రాలేదు. హీరోయిన్‌గా పీక్స్ లో ఉన్న సాయి పల్లవి చిరుకి చెల్లిగా ఒప్పుకుంటుందా అన్నారు.

కానీ సాయి పల్లవి కేరెక్టర్ బావుంది అంటే ఒప్పేసుకుంటుంది... అని తెలిసిన విషయం కావడంతో అందరూ నమ్మారు. అయితే తాజాగా సాయి పల్లవి, చిరుకి సోదరిగా వేదాళం రీమేక్‌లో నటించడమనేది కేవలం రూమర్ అని, అసలు తనపై వస్తున్న ప్రచారానికి తెర దించాలని సాయి పల్లవి కూడా అనుకోలేదట. కారణం అలాంటి న్యూస్‌పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని సన్నిహితుల దగ్గర చెప్పినట్లుగా తెలుస్తుంది. మరో పక్క సాయి పల్లవిని అనుకున్న కేరెక్టర్‌లోకి ఇప్పుడు కీర్తి సురేష్‌ని దింపుతున్నారు. అంటే చిరు సోదరి పాత్ర కోసం మహానటిని రామ్ చరణ్ అండ్ టీం సంప్రదించింది అంటున్నారు. 

మరి ఇది కూడా నిజమని నమ్మలేం ఎందుకంటే.. కీర్తి సురేష్ ప్రస్తుతం స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ మూవీస్ చేస్తున్న టైంలో చిరుకి సోదరిగా అంటే ఒప్పుకోకపోవచ్చు అంటున్నారు. సో ఇది కూడా ఫేక్ న్యూస్ అవుతుంది.

Who is Chiranjeevi sister in vedalam remake:

Vedalam remake: One More Heroine name for Chiru Sister role

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ