Advertisementt

వారికి అమితాబ్‌ని క్వశ్చన్‌ చేసే ధైర్యముందా?

Sun 18th Oct 2020 01:12 PM
amitabh bachchan,remuneration,tollywood,movies  వారికి అమితాబ్‌ని క్వశ్చన్‌ చేసే ధైర్యముందా?
Amitabh Remuneration in News at tollywood వారికి అమితాబ్‌ని క్వశ్చన్‌ చేసే ధైర్యముందా?
Advertisement
Ads by CJ

ఇప్పుడు కరోనా కారణంగా అన్ని ఇండస్ట్రీస్‌లో పారితోషకాల్లో కోత విషయమై నిర్మాతలంతా ఏకతాటి మీదకొచ్చారు. హీరోలు మాత్రమే కాదు.... చాలామంది స్టార్ నటులు పారితోషకాలు తగ్గించుకోవాలని చెబుతున్న ఒక్క హీరో కానీ హీరోయిన్ కానీ ముందుకు రావడం లేదు. మాకు క్రేజ్ ఉంది.. కాబట్టి మేమెందుకు తగ్గాలనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ చితికిపోయింది, ఆదుకుందామనే భావన వాళ్లలో లేదు. కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ ఇప్పటికి వెలవెలబోతున్నాయి. కొత్త ఉత్సాహం లేదు.. ఏదో షూటింగ్‌కి హాజరయ్యామా సేఫ్‌గా ఇంటికొచ్చామా అని అనుకుంటున్నారు కానీ... ఉత్సాహంగా సెట్స్ కి వెళ్లడం లేదు.

మళ్ళీ సినిమా పరిశ్రమ ఎప్పుడు కళకళలాడుతుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఈలోపు పారితోషకాల కటింగ్ అనేది తెర మీదకొచ్చింది. కానీ ఎక్కడా తెగడం లేదు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్‌కి తెలుగు దర్శకనిర్మాతలు వాళ్ళ సినిమాలో నటించేందుకు గాను 25 కోట్ల పారితోషకం ఇచ్చారనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది. అమితాబ్ రేంజ్‌‌ని బట్టి పారితోషకం ఫిక్స్ చేశారు అది వేరే విషయం. కానీ కరోనా కష్ట కాలంలో 20 శాతం పారితోషకాల కటింగ్ అంటున్నారు. మరి అమితాబ్‌కి ఆ 25 కోట్లలో కోత పెట్టారా? లేదంటే అమితాబ్ అడిగింది ఇచ్చేస్తున్నారా. 

అయినా అమితాబ్‌ని మీ పారితోషకంలో 20 శాతం కోత పెట్టుకోండి అని చెప్పే ధైర్యం ఉందా? కొత్త రూల్ ప్రకారం పారితోషకాల కటింగ్ ఉంది.. మరి మీరు అని అమితాబ్‌ని అడిగే ఛాన్స్ కూడా లేదు. ఇక హీరోలు మాత్రం ఎందుకు తగ్గుతారు.

Amitabh Remuneration in News at tollywood:

Doubts on Amitabh remuneration in tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ