Advertisementt

మహేష్, పరశురామ్.. ఏం జరుగుతుంది?

Sat 17th Oct 2020 08:41 PM
mahesh babu,parasuram,movie,sarkaru vaari paata,action,start  మహేష్, పరశురామ్.. ఏం జరుగుతుంది?
Parasuram action started for Sarkaru Vaari Paata మహేష్, పరశురామ్.. ఏం జరుగుతుంది?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు చాలామంది దర్శకులకు హ్యాండ్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా మహేష్ బాబు, పరశురామ్‌కి హ్యాండ్ ఇస్తాడేమో అనే టాపిక్ గత వారం రోజులుగా సోషల్ మీడియాని కమ్మేసింది. త్రివిక్రమ్‌తో సినిమా చేస్తాను అనగానే పరశురామ్ ఉలిక్కి పడ్డాడట. ఎందుకంటే పరశురామ్‌కి మహేష్ దొరక్క దొరక్క దొరికాడు. మహేష్ కోసం పరశురామ్ చాలానే వెయిట్ చేశాడు. కానీ ఇప్పుడు పరశురామ్‌కి లొకేషన్స్ ప్రాబ్లెమ్ వచ్చి సర్కారు వారి పాటను పోస్ట్ పోన్ చేశాడు... కానీ లేదంటే ఈపాటికి అమెరికాలో సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ మొదలయ్యేది. అలాగే యూనిట్‌లో కొంతమందికి వీసా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయనే టాక్ ఉంది.

అందుకే సర్కారు వారి పాట షూటింగ్ వాయిదా పడడంతో మహేష్, త్రివిక్రమ్‌తో సినిమా మొదలు పెడతాడేమో అనే ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ పరశురామ్ ఇప్పుడు కళ్ళు తెరిచి సర్కారు వారి పాట షూటింగ్ కోసం ఆఘమేఘాల మీద రెడీ అవుతున్నాడట. అంటే అమెరికాలో లొకేషన్స్ ప్రాబ్లెమ్ ఉన్నా, యూనిట్‌కి వీసా ప్రాబ్లెమ్ ఉన్నా అన్ని పక్కనబెట్టి పరశురామ్ సర్కారు వారి పాట షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడట. 

అంటే అమెరికా లొకేషన్స్‌లో చెయ్యాల్సిన షూటింగ్ ఆపి.. ఇండియాలో తెరకెక్కించాల్సిన సన్నివేశాల షూట్‌తోనే సర్కారు వారి పాట మొదలెట్టాలని పరశురామ్ డిసైడ్ అయ్యాడట. మరి మహేష్ ఇండియాలోని షూటింగ్‌కి ఓకే అంటే ఓకే.. లేదంటే సర్కారు వారి పాట షూటింగ్ ఆగుతుంది కానీ.. లేదంటే పరశురామ్, మహేష్‌తో సర్కారు వారి పాట షూటింగ్ ఇండియాలోనే మొదలెట్టేస్తాడు. మరి మహేష్ ఛాన్స్ చేజారిపోకుండా ఉండాలంటే పరశురామ్ జాగ్రత్త పడకతప్పదు.

Parasuram action started for Sarkaru Vaari Paata:

Mahesh Babu and Parasuram Movie Sarkaru Vaari Paata.. What Happen?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ