స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు హేమంత్ మధుకర్ రూపొందించిన చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్, మైఖేల్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ వంటి వారు నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. కరోనా కారణంగా థియేటర్స్ లేకపోవడంతో.. అనేకానేక చర్చల అనంతరం ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలైంది. ఓటీటీ విషయంలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైంది. అయితే రివ్యూవర్స్‌ని మెప్పించలేకపోయిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం అందరికీ సేఫ్ ప్రాజెక్ట్‌లా నిలిచిందనేది తాజా సమాచారం.
సినిమాలో ఉన్న కంటెంట్ సంగతి పక్కన పెడితే.. సాంకేతికంగా ఈ చిత్రం రూపొందిన తీరుపై దర్శకుడు హేమంత్ మధుకర్ ప్రశంసలు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. అమెరికాలో ఈ చిత్రం రూపొందించడం.. అనుష్క, మాధవన్, మైఖేల్ మ్యాడ్‌సేన్ వంటి హాలీవుడ్ నటుడు ఈ చిత్రంలో నటించడం వంటివి సినిమాపై మొదటి నుంచి ఆసక్తిని పెంచుతూనే వచ్చాయి. అందులోనూ అనుష్క పాత్రకు మాటలు ఉండవు, వినపడదు.. ఈ చిత్రం కోసం ఆమె సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంది అనేసరికి.. నిజంగానే సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ఇక లాక్‌డౌన్‌లో స్టార్ హీరోలు నటించిన చిత్రమేది విడుదల కాకపోవడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా అమెజాన్ నుంచి మంచి ఆఫర్‌ను దక్కించుకున్న నిర్మాతలు, మంచి టైమ్‌లో ఈ సినిమాని విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వారు.. అలాగే స్టార్ నటీనటులతో ఈ రివేంజ్ డ్రామాని తెరకెక్కించిన దర్శకుడు, నటీనటులూ.. అందరూ హ్యాపీగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో విషయం ఏమిటంటే.. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రానికి భారీ వ్యూస్ వచ్చినట్లుగా ట్రేడ్ నిపుణులు చెబుతుండటం విశేషం.