Advertisementt

థియేటర్లలో సందడి చేయనున్న బాలీవుడ్ సినిమాలివే..

Thu 15th Oct 2020 11:25 AM
bollywood,thappad,tahnaji,kedarnath,malang,ajay devgan  థియేటర్లలో సందడి చేయనున్న బాలీవుడ్ సినిమాలివే..
Five movie are going hit screens. థియేటర్లలో సందడి చేయనున్న బాలీవుడ్ సినిమాలివే..
Advertisement
Ads by CJ

అన్ లాక్ 5.0లో భాగంగా నేటి నుండి థియేటర్లు తెరుచుకుంటున్నాయన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ నేపథ్యంలో థియేటర్లలో వచ్చే సినిమాలు ఏంటనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో థియేటర్లు ఇంకా తెరుచుకోవట్లేదు. కాబట్టి తెలుగు సినిమాలేవీ థియేటర్లలో విడుదల కావట్లేదు. దసరాకి వదిలేసి దీపావళికి వద్దాం అన్న ఆలోచనలోనే అందరూ ఉన్నారు. అయితే బాలీవుడ్ లో మాత్రం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఈ మేరకు ప్రకటన వచ్చింది కూడా. మొత్తం ఐదు సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేయనున్నాయి. అజయ్ దేవగణ్ నటించిన తానాజీ, తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో కనిపించిన థప్పడ్, ఆయుష్మాన్ ఖురానా శుభ్ మంగళ్ జ్యాదా సావ్ దాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సారా ఆలీ ఖాన్ జంటగా నటించిన కేదార్ నాథ్, ఇంకా ఆదిత్య రాయ్ కపూర్ నటించిన మలంగ్ కూడా థియేటర్లలో రాబోతుంది. 

ఐతే ఈ సినిమాలన్నీ గతంలో థియేటర్ల వద్ద సందడి చేసినవే. ఐతే ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయిన సినిమాలేవీ థియేటర్లలోకి రావట్లేదు. మల్టీప్లెక్స్ సంస్థలు ఈ సినిమాలని రిలీజ్ చేయడానికి ఒప్పుకోవట్లేదని సమాచారం. 

Five movie are going hit screens.:

Five movie are going hit screens.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ