Advertisementt

కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్‌లో సునీల్!

Fri 16th Oct 2020 09:08 PM
sunil,anil ravipudi,sequel,comedy film blockbuster film  కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్‌లో సునీల్!
Sunil in Blockbuster movie sequel కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్‌లో సునీల్!
Advertisement
Ads by CJ

హీరోగా ప్లాప్ అయ్యాక కమెడియన్ గానో లేదంటే విలన్ గానో సునీల్ సెటిల్ అవ్వాలని చూస్తున్నాడు. కమెడియన్ గా అడుగడుగునా సునీల్ కి ఫెయిల్యూర్స్ తప్ప హిట్ కనిపించడం లేదు. అల వైకుంఠపురములో మ్యూజికల్ గాను, కంటెంట్ పరంగాను బ్లాక్ బస్టర్ హిట్ కానీ.. సునీల్ కేరెక్టర్‌కి చిన్నపాటి పేరు కూడా రాలేదు. ఇక డిస్కో రాజాతో విలన్ గాను, ఫెయిల్ అయినా సునీల్ ఇప్పుడు ‘కలర్ ఫొటో’లో తాను నటించిన నెగెటివ్ కేరెక్టర్ ఎలా ఉంటుందో అందరితోపాటు వెయిట్ చేస్తున్నాడు. ఆ సినిమా ఈ నెల 23న విడుదల కాబోతుంది.. ఇక తాజాగా సునీల్‌కి ఓ బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్ లో చోటు సంపాదించాడనే టాక్ నడుస్తుంది.

అది అనిల్ రావిపూడి కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఎఫ్ 2 కి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న ఎఫ్ 3 లో సునీల్ కే ఓ మంచి కేరెక్టర్ కేటాయించాడట అనిల్ రావిపూడి. మరి ఎఫ్ 2 కామెడీ హిట్. అందులో వెంకీ, వరుణ్ తేజ్ లు రాజేంద్ర ప్రసాద్ ల కామెడీ సినిమాకే హైలెట్. అలాంటి సీక్వెల్ లో సునీల్ కూడా కామెడీ చేస్తే అతనికి మళ్లీ హిట్ పడినా పడొచ్చు. అంటే ఎఫ్ 3 అవకాశం అనిల్, సునీల్ కి ఇవ్వాలే కానీ.. మళ్లీ కమెడియన్‌గా ఫామ్‌లోకి రావడం పక్కా అంటున్నారు. మరి ఎఫ్ 3 లో సునీల్ కి కేరెక్టర్ గనక పక్కా అనుకుంటే ఇక సునీల్ ఎఫ్ 3 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అని ఎదురు చూడాలేమో .. అంతేగా.. అంతేగా..!

Sunil in Blockbuster movie sequel :

Sunil in Anil Ravipudi F3 movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ