Advertisementt

ఇంకెలా.. చరణ్‌ని మెప్పించేది?

Thu 15th Oct 2020 04:43 PM
ram charan,venky kudumula,hold,mega hero,mega star,bheeshma  ఇంకెలా.. చరణ్‌ని మెప్పించేది?
Ram Charan and Venky Kudumula Combo movie in Hold ఇంకెలా.. చరణ్‌ని మెప్పించేది?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ప్రస్తుతం RRR షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఎన్టీఆర్‌తో కలిసి రామ్ చరణ్ RRRతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత చిరు ఆచార్యలో చరణ్ ఓ రోల్ చేయాల్సి ఉంది. చరణ్ డేట్స్ కోసం, కాజల్ పెళ్లి కోసం ఆగిన ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలెడదామా అని కొరటాల కాచుకుని కూర్చున్నాడు. మరి ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఇంతవరకు ప్రకటించలేదు. తన వద్దకు వచ్చే కథలతో తండ్రి చిరుతో సినిమాలు చేసేస్తున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ కి ఓ పట్టాన కథలు నచ్చడం లేదు. ఎంతమంది దర్శకులు రామ్ చరణ్ కి కథ చెప్పినా చరణ్ నో చెప్పేస్తున్నాడు.

 

తాజాగా మరో దర్శకుడి కథకి చరణ్ నో చెప్పాడని టాక్ నడుస్తుంది. అతనే భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ కుడుముల. భీష్మ తర్వాత చిరు ద్వారా చరణ్‌ని కలిసి కథ వినిపించిన వెంకీ కుడుములను చరణ్ హోల్డ్‌లో పెట్టాడు. తాజాగా వెంకీని లైట్ తీసుకోమని, వేరే హీరోని చూసుకోమని చరణ్ సంకేతాలిచ్చినట్టుగా ఫిల్మ్‌నగర్ టాక్. దానితో హిట్ కొట్టిన స్టార్ హీరో దొరకలేదని వెంకీ కుడుములు ఫీలవుతుంటే.. మరోపక్క రామ్ చరణ్ నెక్స్ట్ మూవీకి ఎలాంటి కథ కావాలో, అసలు ఏ జోనర్ అయితే చరణ్ ఒప్పుకుంటాడు, ఎలాంటి కథ చరణ్ కి వినిపిస్తే.. వర్కౌట్ అవుతుంది అంటూ దర్శకులు ఓ ఆలోచించేస్తున్నారట.

Ram Charan and Venky Kudumula Combo movie in Hold:

Ram Charan and Venky Kudumula latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ