అల్లు అర్జున్‌కి ఎప్పటికి మరిచిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు త్రివిక్రమ్. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఎన్టీఆర్ సైలెంట్‌గా త్రివిక్రమ్‌తో సినిమాని కమిట్ చేయించాడు. ఎన్టీఆర్ హిట్ డైరెక్టర్స్ ని వదలడు. అలా త్రివిక్రమ్‌ని పట్టేశాడు. ఇక తర్వాత మహేష్ ఎందుకు ఊరుకుంటాడు. ఖలేజా, అతడు జస్ట్ హిట్స్ అయినా అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ మీద మహేష్ కన్ను పడింది. అందుకే మహేష్ తాజాగా త్రివిక్రమ్‌తో సినిమాని ప్రకటించాడు.
అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పని సుకుమార్‌తో చేస్తున్నాడు. తర్వాత కొరటాల శివతో సినిమా అయ్యాక తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చెయ్యాలనుకుంటున్నాడనే టాక్ వినబడుతుంది. మరి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్‌ని అల్లు అర్జున్ ఎందుకు వదులుతాడు. కాకపోతే వరసగా సుక్కు, కొరటాలకు కమిట్ అయ్యాడు కానీ.. లేదంటే పుష్ప అవ్వగానే త్రివిక్రమ్ అనేవాడే.
అయితే ఈలోపు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్, మహేష్ మూవీలను ఫినిష్ చేస్తాడు. అలాగే అల్లు అర్జున్ సుక్కు, కొరటాల మూవీస్ ఫినిష్ అవ్వకముందే త్రివిక్రమ్‌తో సినిమాని కమిట్ చేయించినా చేయిస్తాడనే టాక్ మొదలయ్యింది. మరి త్రివిక్రమ్‌కి వెంకీతోనూ, చిరుతోనూ సినిమాలు చెయ్యాలని ఉంది. కానీ అల్లు అర్జున్ పడనిచ్చేలా మాత్రం లేదు.