Advertisementt

వెండితెర పైకి శోభన్ బాబు జీవితం.. హీరోగా రానా..?

Mon 12th Oct 2020 10:39 AM
shobhan babu biopic,rana,virata parvam,telugu,aranya  వెండితెర పైకి శోభన్ బాబు జీవితం.. హీరోగా రానా..?
Rana to play as Shobhan babu..? వెండితెర పైకి శోభన్ బాబు జీవితం.. హీరోగా రానా..?
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా నిజ జీవిత పాత్రలు వెండితెర మీద దర్శనమిస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఇప్పటికే చాలా జీవితాలు వెండితెర మీదకి వచ్చాయి. ప్రస్తుతం నిర్మాణ దశలోనూ చాలా సినిమాలున్నాయి. ఐతే తాజాగా ఆనాటి అందాల రాముడు శోభన్ బాబు గారి జీవితం తెరమీదకి రానుందట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్.

శోభన్ బాబు పాత్రలో రానా దగ్గుబాటి నటించనున్నాడని అంటున్నారు. ఈ మేరకు రానా నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ శోభన్ బాబు జీవిత కథతో తెరకెక్కే సినిమాలో రానా అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రానా చేతిలో ఉన్న సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. అరణ్య షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఇంకా విరాట పర్వం షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.

అదీగాక గుణ శేఖర్ తో ఉండబోయే హిరణ్య కశ్యప చిత్రం ఇప్పట్లో రాదని తేలిపోయింది. శాకుంతలం అనే సినిమాతో గుణ శేఖర్ బిజీగా ఉండడంతో హిరణ్య కశ్యప పక్కకు తప్పుకున్నట్లే. మరి శోభన్ బాబు జీవిత కథతో తెరకెక్కే సినిమాలో రానా నటిస్తాడా లేదా చూడాలి.

Rana to play as Shobhan babu..?:

Rana to play as Shobhan babu..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ