ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంపై ఎక్కడా పోటీ కనిపించడం లేదు. కారణం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మీద పడడమే. ఇక్కడ సినిమాలు తీసి స్టార్స్ అయిన హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మీద కన్నేశారు. ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆఖరుకి అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా మూవీస్ కే జై కొట్టారు. అందుకని వారిని టాలీవుడ్ నెంబర్ వన్ రేస్ లో చూపించలేం.. చెప్పలేం. ఇక మిగిలిన మహేష్ - పవన్ కళ్యాణ్‌లలో నెంబర్ వన్ ఎవరంటే.. ఖచ్చితంగా ఫామ్‌లో ఉన్న సూపర్ మహేషే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ రెమ్యూనరేషన్ పరంగా టాలీవుడ్ నెంబర్ వన్ అంటే పవన్ కళ్యాణ్ అని చెబుతారేమో.
ఎందుకంటే సినిమాలు వదిలేసి రాజకీయాలకు వెళ్లి.. అక్కడ జీరో అయ్యి మళ్లీ సినిమాలు చేస్తున్నప్పటికి పవన్ ఇమేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఆయనకు సోషల్ మీడియాలో, అభిమానుల్లో ఉన్న క్రేజే దానికి నిదర్శనం. తాజాగా పవన్ కళ్యాణ్ పారితోషకం ముచ్చట సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో హైలెట్ అయ్యింది. దానితో పవన్ పారితోషకం చూసిన వారంతా పవన్ టాలీవుడ్ నెంబర్ వన్ అంటున్నారు. వకీల్ సాబ్‌తో భారీ పారితోషకం అందుకుంటున్న పవన్... క్రిష్, హరీష్ శంకర్ అలాగే సురేందర్ రెడ్డి మూవీస్‌కి భారీ పారితోషకమే తీసుకుంటున్నాడని అంటున్నారు.
అయితే ఇప్పుడు పవన్ చెయ్యబోయే ఆ ఐదో సినిమా విషయంలో పారితోషకం బాగా హైలెట్ అవుతుంది. అది మలయాళం అయ్యప్పన్ కోషియం రీమేక్. పవన్ ఎప్పటినుండో ఆ రీమేక్ చేస్తాడని ప్రచారం జరుగుతుంటే.. ఇప్పుడు ఆ సినిమా కోసం పవన్ 40 రోజుల డేట్స్ కేటాయించాడని.. అందుకు గాను పవన్ కళ్యాణ్ 50 కోట్ల పారితోషకం అందుకోబోతున్నట్టుగా ఫిలింసర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న న్యూస్. అంటే పవన్ కళ్యాణ్ ఒక్క రోజు కాల్షీట్ విలువ కోటి 25 లక్షలన్నమాట. మరి ఈ లెక్కన చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నెంబర్ వన్ అనే చెప్పాలి కదా.