Advertisementt

‘పోకిరి’కి ఈ హీరో అంత కనెక్ట్ అయ్యాడా?

Mon 12th Oct 2020 08:55 PM
vijay deverakonda,puri jagannadh,reveal,fighter,movie secrets  ‘పోకిరి’కి ఈ హీరో అంత కనెక్ట్ అయ్యాడా?
Vijay Deverakonda likes Puri Pokiri Movie ‘పోకిరి’కి ఈ హీరో అంత కనెక్ట్ అయ్యాడా?
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో చాలా తక్కువ కాలంలో స్టార్ రేంజ్ కి చేరుకున్న హీరో. టాలీవుడ్‌లోనే కాదు విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్‌లో కూడా భీభత్సం. అందుకే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా లెవల్‌కి ఓ సినిమా చేస్తున్నాడు. అయితే పూరి అంటే తనకి ఎప్పటినుండో చాలా ఇష్టమంటున్నాడు. పూరి మేకింగ్ స్టయిల్ కి తానెప్పుడూ అభిమానినే అంటున్న విజయ్.. మహేష్ బాబుతో పూరీ చేసిన పోకిరి అంటే తనకు చాలా ఇష్టమని.. అందుకే పూరి జగన్నాధ్‌తో ఓ మంచి కమర్షియల్ మూవీ చేయాలని ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లుగా చెప్పాడు విజయ్ దేవరకొండ.

పోకిరి లాంటి కమర్షియల్ సినిమా ఇప్పటివరకు చేయలేదని అందుకే ఆ సినిమా నా ఫేవరెట్ అంటున్నాడు విజయ్. మరి విజయ్ దేవరకొండకి పూరి జగన్నాధ్ ఫైటర్ సినిమా కథని కమర్షియల్ రేంజ్‌లో ప్రిపేర్ చేసి ఒప్పించాడేమో అందుకే.. విజయ్ దేవరకొండ అలాంటి కథతో పాన్ ఇండియా లెవల్లో సినిమా తీస్తే హిట్ అవుతుంది అని పూరీని ఒప్పించి ఉంటాడు. ఇక పూరితో చెయ్యబోయే సినిమా కోసం ఎనిమిది నెలలు కష్టపడి వర్కౌట్స్ చేస్తున్నా అని.. ఈ సినిమా కోసం తాను సిక్స్ ప్యాక్ కానీ.. ఎయిట్ ప్యాక్‌లో కనిపిస్తా అని చెబుతున్నాడు. 

అంతేకాదు అన్ని రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లాగే మాస్ స్టయిల్ కమర్షియల్‌లో ఫైటర్ ఉంటుందని చెబుతున్న విజయ్‌ని చూస్తే పోకిరి లాంటి కథ కావడం వల్లనే విజయ్ పూరికి కనెక్ట్ అయ్యాడనిపిస్తుంది.

Vijay Deverakonda likes Puri Pokiri Movie:

Vijay Deverakonda reveals Fighter secrets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ