కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 తర్వాత తెలుగులో ఎన్టీఆర్ తో అయినా, ప్రభాస్ తో అయినా సినిమా చేయబోతున్నాడనే టాక్ ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. ముందు నుండి అయితే కెజిఎఫ్ తర్వాత ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో మైత్రి మూవీస్ వారు సినిమా సెట్ చేశారని.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కి కథ కూడా వినిపించేశాడని అబ్బో మాములుగా ప్రచారం జరగలేదు. కారణం ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి విషెస్ చెప్పడం దాన్ని మైత్రి వారు పబ్లిసిటీ చెయ్యడంతో అందరూ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ కన్ఫర్మ్ అయినట్లే అనుకున్నారు. తర్వాత ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తో సినిమా అంటూ ప్రచారం జరిగింది.
ప్రభాస్ రాధేశ్యామ్, నాగ్ అశ్విన్, ఆదిపురుష్ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా కన్ఫర్మ్ కాబోతున్నట్టుగా, త్వరలోనే ఆ సినిమాపై ప్రకటన రాబోతున్నట్టుగా ప్రచారం జరగడం మధ్యలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ మీద ఫైర్ అవడం, అసలు కన్నడ హీరోలను వదిలేసి తెలుగు హీరోలు నీకెందుకు అని కన్నడ ప్రేక్షకులు ప్రశాంత్ మీద దండెత్తడం అబ్బో చాలానే నడిచింది. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ ముందు ఎన్టీఆర్ తోనా? లేదంటే ప్రభాస్ తోనా? ఎవరితో ముందు సినిమా చెయ్యబోతున్నాడో అనేది చెప్పేది కెజిఎఫ్ చాప్టర్ 2 పూర్తి చేసి సినిమా విడుదలయ్యాకే డెసిషన్ తీసుకుంటాడట.
ఎవరు ఏ ప్రాజెక్ట్ అయినా ముందు కెజిఎఫ్ బాధ్యతలు పూర్తయ్యాకే అని ప్రశాంత్ నీల్ చెప్పడంతో ఇప్పుడు ప్రభాస్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు.