సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి, తన తన తర్వాతి చిత్రంగా ఎఫ్ 3 ని తెరకక్కించాలని ప్లాన్ చేసాడు. లాక్డౌన్ లో ఆ సినిమా విషయమై స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి చేసాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్ 3 సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఎఫ్ 2 సినిమాలో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్.. తమ తమ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఎఫ్ 3 ఇప్పుడప్పుడే మొదలయ్యేలా లేదు.
సో.. అనిల్ రావిపూడి ఎఫ్ 3 ని పక్కన పెట్టి తన దగ్గరున్న మరో స్క్రిప్టుతో వెళ్దామని అనుకుంటున్నాడట. వెంకటేష్, వరుణ్ అందుబాటులోకి వచ్చే గ్యాప్ లో మరో సినిమా తీద్దామని అనుకుంటున్నాడట. ఐతే ఇప్పటి వరకు అన్నీ కమర్షియల్ చిత్రాలే తెరకెక్కించిన అనిల్, ఈ సారి కూడా అదే ఫార్మాట్లో వెళ్ళనున్నాడట. కాకపోతే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. మరి అనిల్ రావిపూడి సినిమాలో నటించే హీరోయిన్ ఎవరో చూడాలి.