Advertisementt

మెగా అభిమానుల ఎదురుచూపులన్నీ అందుకోసమే..

Thu 08th Oct 2020 08:30 PM
mega fans,megastar,chiramnjeevi,acahrya,ram charan,koratala shiva,kajal  మెగా అభిమానుల ఎదురుచూపులన్నీ అందుకోసమే..
Mega Fans are waiting for.. మెగా అభిమానుల ఎదురుచూపులన్నీ అందుకోసమే..
Advertisement
Ads by CJ

అనుకోకుండా వచ్చిన ఉపద్రవం కారణంగా ఒక్కసారిగా అన్నీ ప్లాన్లన్నీ తారుమారయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో కరోనా తెచ్చిన స్తంభన అంతా ఇంతా కాదు. ఆరు నెలల పాటు సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. ఐతే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా షూటింగులని రీస్టార్ట్ చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం సూచించిన భద్రతా సూచనల నడుమ చిత్రీకరణ మొదలు పెడుతున్నారు.

ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ మొదలైంది. అల్లు అర్జున్ పుష్ప పనులు రెడీ అవుతున్నాయట. ఇంకా నాని టక్ జగదీష్ స్టార్ట్ చేసాడు. ఇలా ఒక్కొక్కరుగా తమ సినిమా షూటింగ్ ని మొదలెడుతుంటే, మెగాస్టార్ ఆచార్య సినిమా షూటింగ్ పై ఎలాంటి సమాచారం బయటకి రాలేదు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులంతా ఆచార్య సినిమా షూటింగ్ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగులన్నీ మొదలవుతున్న వేళ ఆచార్య సినిమా షూటింగ్ రీస్టార్ట్ గురించి ఆలోచిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తుంది. రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

Mega Fans are waiting for..:

Mega Fans are waiting for..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ