Advertisementt

యంగ్ హీరో.. సునీల్ ని డైరెక్ట్ చేస్తాడట..

Thu 08th Oct 2020 07:57 PM
sunil,raj tarun,telugu,orey bujjigaa  యంగ్ హీరో.. సునీల్ ని డైరెక్ట్ చేస్తాడట..
Young hero want to direct hero Sunil.. యంగ్ హీరో.. సునీల్ ని డైరెక్ట్ చేస్తాడట..
Advertisement
Ads by CJ

ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్, ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత రాజ్ తరుణ్ చేసిన సినిమా చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్ సినిమాలతో హీరోగా బిజీ ఐపోయాడు. ఐతే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినన్ని రోజులు ఆఫర్లు వస్తూనే ఉంటాయి. ఒక్కసారి అపజయం పలకరించిందా అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ ని వరుస ఫ్లాపులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి.

తాజాగా రిలీజ్ అయిన ఒరేయ్ బుజ్జిగా కూడా సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది. థియేటర్లు మూసి ఉన్న కారణంగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. ఫలితం రాజ్ తరుణ్ కెరీర్లో మరో ఫెయిల్యూర్. ఐతే హీరోగా అపజయాలని ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడట. నిజానికి రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి వచ్చిందై దర్శకుడిగా అవకాశం కోసమే. కానీ అనుకోకుండా హీరో అయ్యాడు.

ఐతే ప్రస్తుతం దర్శకత్వం వైపు మళ్ళాలని అనుకుంటున్నాడని సమాచారం. సునీల్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కథ రాసుకున్నాడట. అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరమే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందట. హీరోగా ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్, దర్శకుడిగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

Young hero want to direct hero Sunil..:

Young hero want to direct hero Sunil..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ