గత కొన్ని రోజులుగా వరుస ఫ్లాపులు రవితేజని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకి సరైన హిట్ రాలేదు. చివరగా వచ్చిన డిస్కోరాజా చిత్రం కూడా విజయాన్ని ఇవ్వలేకపోయింది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైంటిఫిక్ మాస్ థ్రిల్లర్ భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఐతే ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
ఐతే కరోనా కారణంగా నిలిచిపోయిన క్రాక్ సినిమా షూటింగ్ ఈరోజు స్టార్ట్ కానుంది. ఈ మేరకు చిత్రబృందం పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కొక్కరుగా తమ సినిమా షూటింగులు మొదలుపెడుతున్నారు. ఆ విధంగా ఈ రోజు క్రాక్ సినిమా షూటింగ్ మొదలైంది. రవితేజ, ఇందులో పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్నాడు. కామెడీతో పాటు మాస్ అంశాలు దండిగా ఉంటాయని సమాచారం.
డాన్ శీనుతో రవితేజకి మంచి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని, క్రాక్ తో మళ్ళీ విజయం అందిస్తాడేమో చూడాలి. బీ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.