Advertisementt

ఆ షోకి నాగార్జునే ఇంపార్టెంట్.. అందుకే ప్లైట్!!

Fri 09th Oct 2020 09:04 PM
bigg boss 4 telugu,chartered flight,king nagarjuna,wild dog movie,shooting  ఆ షోకి నాగార్జునే ఇంపార్టెంట్.. అందుకే ప్లైట్!!
A chartered flight for Bigg Boss 4 Telugu host King Nag ఆ షోకి నాగార్జునే ఇంపార్టెంట్.. అందుకే ప్లైట్!!
Advertisement
Ads by CJ

గత రాత్రి బిగ్ బాస్ హౌస్ నామినేషన్ ప్రక్రియ జరిగింది. హౌస్ మేట్స్ అంతా ఏడుపులు పెడబొబ్బలు, అబ్బో ఓ రేంజ్ లో జరిగింది నామినేషన్ ప్రక్రియ. ఇప్పటివరకు చాలామంది సేఫ్ గేమ్ ఆడారు. కానీ సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ రంగులు అందరికి అర్ధమైనాయి. ఇక మోనాల్ కోసం అఖిల్, అభి, సోహైల్ లు కొట్టుకోవడం చూస్తే అమ్మాయి కోసం అంత మంచి అబ్బాయిల మధ్యన అంత గొడవ అవసరమా అనిపిస్తుంది. ఇక మోనాల్ గజ్జర్ అయితే ఏడుపులు పెడబొబ్బలతో హౌస్ దద్దరిల్లింది. సోహైల్ ఎప్పటిలాగే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నోరు పారేసుకున్నాడు. ఇక నాగార్జున కూడా సోహైల్ అరుపులను మెచ్చుకోవడంతో సోహైల్ ఇంకా రెచ్చిపోతున్నాడు కానీ తగ్గడం లేదు. కొంతమంది సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేశారు.

ఇక శని ఆది వారాల్లో హౌస్ మేట్స్ ని కంట్రోల్ చేస్తూ క్లాస్ లిస్తూ వాళ్ళని దారిలో పెడుతున్నాడు నాగ్. అయితే ఇప్పుడు నాగార్జునకి చిన్న చిక్కొచ్చి పడిందంటున్నారు. అదేమిటంటే నాగార్జున అటు సినిమా షూటింగ్ తోనూ ఇటు బిగ్ బాస్ షూటింగ్ తోనూ బిజీ అయ్యాడు. అయితే నాగ్ తాజా చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ హైదరాబాదులో జరిగినంతసేపు బిగ్ బాస్ షూటింగ్ కి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. అయితే నాగార్జున వైల్డ్ డాగ్ షూట్ అవుట్ డోర్‌కి మారబోతుంది. దాని కోసం నాగార్జున హైదరాబాద్‌ని వదిలి వెళ్లాల్సి ఉందట. అయితే ఏకధాటిగా ఓ 10 రోజుల షూటింగ్ చెయ్యాల్సి ఉంటుందట. అయితే ఆ షూటింగ్ కోసం ఇండియాలోనే కొన్ని లొకేషన్స్‌ని షూట్ ప్లాన్ చేస్తున్నారు. లేదంటే విదేశాలకు వెళ్లొచ్చు. 

అయితే దాని కోసం బిగ్ బాస్‌కి నాగార్జున ఓ రెండు ఎపిసోడ్స్ కి రాకపోవచ్చు. కానీ ఈ విషయంలో బిగ్ బాస్ ఒప్పుకోకపోవడమే కాదు... నాగ్ కూడా సన్నద్ధంగా లేరట. అందుకోసమే బిగ్ బాస్ యాజమాన్యం నాగ్ ఎక్కడ షూటింగ్ చేసినా అక్కడనుండి బిగ్ బాస్ షూటింగ్ కోసం రావడానికి ఓ చార్టెడ్ ఫ్లైట్ ఆరెంజ్ చెయ్యాలని అనుకుంటుందట. నాగ్ హోస్టింగ్ లో శని ఆదివారాలు ఎపిసోడ్స్ చాలా కీలకంగా ఉండడంతో.. నాగ్ ని షో కోసం ప్రత్యేకంగా తీసుకురావడానికి బిగ్ బాస్ ఎలాంటి ఏర్పాట్లు చెయ్యడానికైనా రెడీ అంటుందట.

A chartered flight for Bigg Boss 4 Telugu host King Nag:

Bigg Boss 4 Telugu latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ