థియేటర్స్ బంద్ దగ్గరనుండి ఏ సినిమాని కొనేద్దామా అని ఓటిటి సంస్థలు కాచుకుని కూర్చున్నాయి. ఎలాగైనా థియేటర్స్‌లోనే విడుదల చెయ్యాలనుకున్న హీరోలు చివరికి నిర్మాతల ఒత్తిడితో తమ సినిమాలని ఓటిటీలకి అమ్మేస్తున్నారు. అయితే ఓటిటి ద్వారా విడుదలైన సినిమాలకు మంచి టాక్ వచ్చిన పాపం పోలేదు. కీర్తి సురేష్ పెంగ్విన్, వి, నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా ఇవన్నీ ఓకే ఓకేగా ప్రేక్షకులను మెప్పించాయి. థియేటర్స్ బంద్ కారణంగా ఓటీటీలకు మొగ్గు చూపుతున్న హీరోలంతా ఇప్పుడు ఓటిటి ప్లాప్ చూసి బెంబేలెత్తుతున్నారట. నిన్నమొన్నటివరకు ఓటిటి ఆఫర్స్‌కి బెండ్ అయిన హీరోలే ఇప్పుడు చేతులు జోడిస్తున్నారట.
ఓటిటిలో అమెజాన్ ప్రైమ్ క్రేజ్ మాములుగా లేదు. అందుకే అమెజాన్ వారు హీరోలకు భారీ లాభాలు ఎర వేసి లాగేస్తున్నారు. కానీ ఈమధ్యన అమెజాన్ కొన్న ఓ మాదిరి సినిమాల్ని దెబ్బేయ్యడంతో.. అమెజాన్‌కి అమ్ముదామనుకుని టెంప్ట్ అవుతున్న హీరోల గుండెల్లో రాయి పడిందట. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటరుని సాయి ధరమ్ ఓటిటికి అమ్మేస్తాడని అంటుంటే.. ఇప్పుడు ఓటిటికో దణ్ణం నా సినిమా డిసెంబర్ వరకు ఆపి అయినా థియేటర్స్‌లోనే విడుదల చేస్తా అంటున్నాడట.
ఎలాగూ ఈ 15 నుండి థియేటర్స్ తెరుచుకుంటున్నాయి. ఓ రెండు నెలలు గ్యాప్ ఇచ్చాక అయిన థియేటర్స్‌లోనే మన సినిమా అని దర్శకనిర్మాతలకు చెప్పేశాడట.