Advertisementt

పూజా వద్దుబాబోయ్‌ అంటున్నారంట..!

Fri 09th Oct 2020 12:51 AM
pooja hegde,ntr,fans,request,trivikram srinivas,movie,heroine,no pooja  పూజా వద్దుబాబోయ్‌ అంటున్నారంట..!
Jr NTR Fans request to Trivikram about Heroine పూజా వద్దుబాబోయ్‌ అంటున్నారంట..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ హీరోలకు ఒక్క పూజాహెగ్డే తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. కాజల్, సమంత, తమన్నా లాంటి వాళ్ళు సీనియర్స్ అవడం కొత్త హీరోయిన్స్ ఇంకా ఎంట్రీ ఇవ్వకపోవడంతో గత రెండు మూడేళ్లుగా పూజాహెగ్డేనే స్టార్ హీరోలను చుట్టేస్తోంది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ఎవరికైనా పూజానే హీరోయిన్. ఈమధ్యన ఏ సినిమా చూసినా ఆమె తప్ప మరొకరు కనిపించడం లేదు. మధ్యలో రష్మిక వచ్చినా పూజాహెగ్డే హైట్ ముందు రష్మిక కొద్దిగా వెనకబడింది. అయితే తాజాగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతుంది అని.. హీరోయిన్స్‌ని ఎక్కువగా రిపీట్ చేసే త్రివిక్రమ్ చూపు మళ్ళీ పూజా పైనే పడిందనే టాక్ మొదలైంది.

అరవింద సామెత, అల వైకుంఠపురములో సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ - అల్లు అర్జున్‌లకు పూజాహెగ్డేనే రిపీట్ చేశాడు. ఇక తాజాగా ఎన్టీఆర్‌కి మరో హీరోయిన్ ఛాయస్ లేకపోవడంతో పూజాహెగ్డేనే మళ్ళీ ఎన్టీఆర్ కోసం సెట్ చేయబోతున్నాడని అంటున్నారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పూజా వద్దు బోర్ అంటున్నారట. త్రివిక్రమ్‌కి ఈ మేర రిక్వెస్ట్‌లు కూడా పెడుతున్నారట ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి త్రివిక్రమ్ పూజాహెగ్డేని మెయిన్ లీడ్‌కి తీసుకుని సెకండ్ హీరోయిన్‌గా మరో సౌత్ భామ అమృత అయ్యర్ ని తీసుకోబోతున్నట్టుగా టాక్ ఉంది. 

అమృత అయ్యర్ ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్ సినిమాల్లో నటించింది. ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ పట్టించుకుంటాడో లేదంటే ఎప్పటిలాగే పూజాహెగ్డేనే రిపీట్ చేస్తాడో చూద్దాం.

Jr NTR Fans request to Trivikram about Heroine:

No pooja for NTR.. fans Request viral in social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ