Advertisementt

ఆ సినిమాకి 20 డేస్ కాల్షీట్స్‌ ఇచ్చిన పవన్‌!!

Fri 09th Oct 2020 12:44 AM
pawan kalyan,vakeel saab,movie,shooting,update  ఆ సినిమాకి 20 డేస్ కాల్షీట్స్‌ ఇచ్చిన పవన్‌!!
Pawan vakeel saab Latest Update ఆ సినిమాకి 20 డేస్ కాల్షీట్స్‌ ఇచ్చిన పవన్‌!!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం దుబాయ్‌లో ఇండియా ఐపీఎల్ మ్యాచ్ లు 20 - 20 అంటూ యమా రంజుగా సాగుతున్నాయి. సాయంత్రం అయితే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు క్రికెట్ అభిమానులు. ఎలాగూ స్టేడియంకి వెళ్లి క్రికెట్ చూడడానికి కరోనా అడ్డం పడడంతో అందరూ 20 - 20 ఐపీఎల్ మ్యాచ్‌లను టివీల్లోనే వీక్షించేస్తున్నారు. అయితే టాలీవుడ్ టాప్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 20 - 20 అంటున్నాడట. అంటే నేను చెయ్యాల్సిన వకీల్ సాబ్ షూటింగ్‌కి కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇస్తా అని చెబుతున్నాడట. ఆ 20 రోజుల్లో మీరు కిందా మీదా పడండి.. నేను మాత్రం కేవలం 20 రోజులే డేట్స్ అడ్జెస్ట్ చేస్తా అని వేణు శ్రీరామ్ దగ్గర నుండి దిల్ రాజుకి చెప్పేశాడట.

ప్రస్తుతం దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ షూటింగ్ మొదలు పెట్టేశాడు. పవన్ కళ్యాణ్ లేని సీన్స్‌ని తెరకెక్కిస్తూ పవన్ షూటింగ్‌లో ఎప్పుడు జాయిన్ అవుతాడో అని ఎదురు చూస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఈ నెల 26 నుండి వకీల్ సాబ్ షూట్‌కి జాయిన్ అవుతానని చెప్పినట్లుగా తెలుస్తుంది. పవన్ ఇచ్చిన 20 రోజుల కాల్షీట్స్ లో వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చెయ్యాల్సి ఉంది. మరి పవన్ ఇచ్చిన 20 రోజులు వేణు శ్రీరామ్ నాన్ స్టాప్ షూటింగ్ చెయ్యాల్సి ఉంటుంది. లేదంటే పవన్ మళ్ళీ దొరకడు. 

ఇక షూటింగ్ నవంబర్‌కి పూర్తి చేసి డిసెంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని వచ్చే సంక్రాంతికి వకీల్ సాబ్ సినిమాని విడుదల చేసే ప్లాన్‌లో నిర్మాత దిల్ రాజు ఉన్నాడు. పాపం కరోనా కారణంగా ఆరు నెలలు అనుకున్న వకీల్ సాబ్ కాస్త ఏడాదికి కానీ పూర్తి కాలేదు.

Pawan vakeel saab Latest Update:

Vakeel Saab movie shooting resumed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ