ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్లో మంచి మాస్ మసాలా చిత్రంగా నిలిచిపోయిన చిత్రం.. ఇస్మార్ట్ శంకర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చిందీ చిత్రం. అటు రామ్ కేరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఐతే తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా హిందీలొ రీమేక్ కి వెళ్ళనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ విషయమై మరోమారు వార్తల్లో నిలిచింది ఇస్మార్ట్ శంకర్ మూవీ. ఛాక్లెట్ బాయ్ గా కనిపించే రామ్ ని పూర్తి మాస్ హీరోగా చేసిన ఈ చిత్ర హిందీ రీమేక్ మరికొద్ది రోజుల్లో తెరమీదకి రానుందట. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఇస్మార్ట్ శంకర్ గా కనిపించనున్నాడట. ఈ మేరకు అధికారిక సమాచారం రానప్పటికీ ఇస్మార్ట్ శంకర్ రీమేక్ లో రణ్వీర్ సింగ్ కన్ఫార్మ్ అయిపోయాడని అంటున్నారు.
గతంలో టెంపర్ హిందీ రీమేక్ సింబాలో హీరోగా నటించి సక్సెస్ అందుకున్న రణ్వీర్, మరో మారు తెలుగు రీమేక్ తో సక్సెస్ అవుతాడేమో చూడాలి. చిత్ర నిర్మాతలు, దర్శకుడు, నటీనటుల విషయాలతో అధికారిక సమాచారం మరికొద్ది రోజుల్లో రానుందట.