Advertisementt

RRR: అప్డేట్ రేపే.. ఏం చెప్పబోతున్నారు..?

Mon 05th Oct 2020 05:50 PM
rrr,rajamouli,ntr,ramcharan,keeravani  RRR: అప్డేట్ రేపే.. ఏం చెప్పబోతున్నారు..?
RRR Update coming Tomorrow.. RRR: అప్డేట్ రేపే.. ఏం చెప్పబోతున్నారు..?
Advertisement
Ads by CJ

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ప్రతీ సినిమా అభిమాని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతోన్న కల్పిత కథని వెండితెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, సీతారామరాజు గా రామ్ చరణ్.. ఇద్దరినీ ఒకే తెరపై ఎప్పుడు చూస్తామా అని ఉబలాటపడుతున్నారు.

ఐతే వారందరి కోరిక తీరడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆగిపోవడంతో అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఆర్ ఆర్ ఆర్ నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని చూస్తున్నారు. లాక్డౌన్ మొదట్లో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ లుక్ విడుదల చేసారు. ఈ లుక్ వీడియోకి అందరూ ఫిదా అయ్యారు. అప్పటి నుండి ఎన్టీఆర్ లుక్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు.

అదెప్పుడు విడుదల అవుతుందో తెలియదు గానీ తాజాగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి సర్ప్రైజ్ రాబోతుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ టీమ్, పండగలపై శుభాకాంక్షలు తెలిపే అప్డేట్లు చాలించుకుని ఆర్ ఆర్ ఆర్ పై అసలైన అప్డేట్ తో రాబోతున్నాం అంటూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ అప్డేట్ ఏమై ఉంటుందని అందరికీ ఆతృతగా ఉంది. 

ఎన్టీఆర్ మీద సన్ని వేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉన్నందున్న లుక్ వీడియో అయ్యుండదు. సో.. ఆర్ ఆర్ ఆర్ లోని ఇతర నటీనటుల పరిచయమో లేక, కీలక పాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్.. అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఒక్కసారిగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి అప్డేట్ అంటూ వచ్చిన వార్త అందరిలో చలనం తెప్పించింది.

RRR Update coming Tomorrow..:

RRR Update coming Tomorrow..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ