Advertisementt

ఆమె వల్ల మా RRR కేం కాదు: రాజమౌళి

Tue 06th Oct 2020 09:53 PM
ss rajamouli,alia bhatt,ssr,ram charan,jr ntr,sushanth singh rajput,effect  ఆమె వల్ల మా RRR కేం కాదు: రాజమౌళి
Rajamouli reaction on Alia Bhatt effect on RRR movie ఆమె వల్ల మా RRR కేం కాదు: రాజమౌళి
Advertisement
Ads by CJ

సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య విషయంలో బాలీవుడ్ స్టార్ కిడ్స్ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అలియా భట్, అనన్య పాండే, సోనాక్షి, సోనమ్ కపూర్, సారా అలీఖాన్, షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఇలా ఎవ్వరిని వదలడం లేదు సుశాంత్ సింగ్ అభిమానులు. దానితో ఆ స్టార్ కిడ్స్ నటిస్తున్న సినిమాలపై ఆ ఎఫెక్ట్ పడేలా ఉందంటూ ప్రచారం జోరుగా జరిగింది. ఇక అలియా భట్ కయితే సడక్ 2 తోనే చుక్కలు కనిపించాయి. ఇక ఆమె నటిస్తున్న బ్రహ్మాస్త్ర , RRR పై సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఎఫెక్ట్ పడుతుంది అన్నారు. కానీ రాజమౌళి మాత్రం నేను న్యూస్ ఫాలో అవడం మానేసి చాలా రోజులే అయ్యింది. నాకు సుశాంత్‌కి సంబందించిన కేసులో జనరల్ ఐడియా ఉంది.

ఇక అలియా భట్ వలన RRR మీద ఎఫెక్ట్ పడుతుందా... లేదా అనేది పక్కనబెడితే.. అలియా భట్ పెంటాస్టిక్ పెరఫార్మెర్. మా RRR లో సీత కేరెక్టర్‌కి అలియా భట్ పర్‌ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అని ఆమెని అప్రోచ్ అయ్యాం. ఇక అలియా భట్ కూడా కేరెక్టర్ నచ్చి సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది. ఇక అలియా భట్ పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుందో అనేది నాకు తెలియదు. ఇక తన పర్సనల్ ప్రాబ్లెమ్ వలన మా సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది అని అనుకోవడం లేదు. అలాగే మా సినిమా ఆమె లైఫ్‌పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో తెలియదు. ఇక సోషల్ మీడియా అంటారా.. అందులోని అరుపులు, కేకలు అన్ని కొద్ది రోజులే. 

ఇక పర్సనల్ లైఫ్‌కి ముడిపెట్టిన ప్రేక్షకులు థియేటర్స్‌కి రారు. ప్రేక్షకులు అలా ఆలోచిస్తారని కూడా నేను అనుకోవడం లేదు. అసలు ప్రేక్షకులు స్టార్స్ పర్సనల్ లైఫ్‌కి సినిమాకి ముడిపెడతారని అనుకోవడం లేదంటూ.. అలియాపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. 

Rajamouli reaction on Alia Bhatt effect on RRR movie:

No problem to RRR with Alia Bhatt says SS Rajamouli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ