అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన నిశ్శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. గాంధీ జయంతి రోజు నుండి అమెజాన్ లో అందుబాటులో ఉంటున్న ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకి కలెక్షన్లు ఉండవు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే స్పందన ద్వారానే సినిమా ఎలా ఉందో అంచనా వేస్తుంటారు. ఆ లెక్కన చూస్తే నిశ్శబ్దం చిత్రానికి సరైన స్పందన రాలేదనే చెప్పాలి.
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలని అందుకుందా అంటే సందేహమే. ఐతే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందట. ఈ విషయమై చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ ఒకానొక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమంత్ మధుకర్, నిశ్శబ్దం చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు.
ఐతే నిశ్శబ్దం సినిమాకే రెస్పాన్స్ కరువైపోతున్న తరుణంలో సీక్వెల్ అంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ప్రశ్న. మరి దర్శకుడు నిజంగానే సీక్వెల్ తీస్తాడా లేదా చూడాలి.