అనూ ఇమాన్యుయేల్.. నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన భామ. మజ్ను సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే ఆడింది. అంతేకాదు, అందులో అనూ నటనకీ, గ్లామర్ కి మంచి మార్కులే పడ్డాయి. ఐతే ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ అనుకున్నట్లుగా సాగలేదు. రాజ్ తరుణ్ తో చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ అనూ ఇమ్మాన్యుయేల్ కి అజ్ఞాత వాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సినిమాలు దక్కాయి.
స్టార్ హీరోల సరసన అమాంతం ఛాన్స్ పట్టేసింది కానీ ఆ రెండు సినిమాల ఫలితాలు నిరాశ పరచడంతో అనూ కి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఐతే తాజాగా అనూ ఖాతాలో రెండు సినిమాలు చేరాయని టాక్. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న అల్లుడు అదుర్స్ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది.
తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కే సినిమాలో అనూ కి హీరోయిన్ గా అవకాశం వచ్చిందట. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా కనిపించనుందట. ఇద్దరు హీరోయిన్లు గల ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనూ చేస్తుందట. మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఎంపికైందని సమాచారం. మరి ఈ సినిమాలతోనైనా అనూ ఇమ్మాన్యుయేల్ సక్సెస్ వస్తుందేమో చూడాలి.