పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు సైన్ చేస్తూ ఫ్యాన్స్‌కి పూనకం తెప్పిస్తున్నాడు. వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు పూర్తయితే అప్పుడు క్రిష్ సినిమా.. తర్వాత హరీష్ శంకర్‌తో అలాగే సురేందర్ రెడ్డితో సినిమాలు లైన్‌లో పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఇంత త్వరగా ఇంత స్పీడుగా మూవీస్‌కి కమిట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. తాజాగా పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్‌కి సినిమా చేస్తానని మాటిచ్చినట్టుగా బండ్ల గణేశే చెప్పాడు. దానితో పవన్ - బండ్ల దర్శకుడు డాలి అనే ప్రచారం జరిగింది. మధ్యలో బండ్లకి కేవలం మాట మాత్రమే ఇచ్చాడు. కానీ ఇప్పట్లో పవన్, బండ్ల గణేష్ సినిమా చెయ్యడని కూడా అన్నారు.
అయితే తాజాగా బండ్ల గణేష్ ముందే కథని, దర్శకుడిని లైన్‌లో పెట్టుకున్నాకే పవన్ దగ్గరికి వెళ్లి మాట తీసుకున్నాడని అంటున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్‌తో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేసిన పూరి జగన్నాధ్‌తో సినిమాని బండ్ల సెట్ చేసుకున్నాడనే టాక్ సోషల్ మీడియాలో మొదలైంది. బండ్ల పూరితో క్లోజ్ అయ్యి పవన్ కి కథ రాయమని.. దానితో పవన్‌ని ఒప్పిద్దామని చెప్పి ముందే పవన్ దగ్గర మాట తీసుకుని పవన్ చేత బండ్ల సినిమాకి కమిట్ చేయించాడట. తర్వాత పూరితో పవన్‌కి మీటింగ్ ఏర్పాటు చేసి పవన్ - పూరి - బండ్ల కాంబోని బండ్ల అధికారికంగా ప్రకటిస్తాడనే టాక్ అయితే ఫిలింసర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.