Advertisementt

మోసగాళ్ళు టీజర్: మంచు విష్ణు ఆటిప్పుడే మొదలెట్టాడు..

Sat 03rd Oct 2020 10:52 AM
mosagallu,manchu vishnu,kajal agarwal,allu arjun  మోసగాళ్ళు టీజర్: మంచు విష్ణు ఆటిప్పుడే మొదలెట్టాడు..
Manchu Vishnu Mosagaallu Teaser released.. మోసగాళ్ళు టీజర్: మంచు విష్ణు ఆటిప్పుడే మొదలెట్టాడు..
Advertisement
Ads by CJ

మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన మోసగాళ్ళు చిత్ర టీజర్ ఈ రోజే విడుదలైంది. అల్లు అర్జున్ టీజర్ ని రిలీజ్ చేస్తూ మోసగాళ్ళు చిత్రబృందానికి విషెస్ తెలిపాడు. అరనిమిషం పాటు ఉన్న ఈ టీజర్లో ఐటీ స్కాం గురించిన అంశాలే ఉన్నాయి. ముందుగా అమెరికా అధ్యక్ష్యుడు ఈ స్కాం గురించి మాట్లాడుతూ, అందరినీ పట్టుకుంటామని దేశప్రజలకు సందేశం ఇస్తున్నాడు. 450 మిలియన్ డాలర్ల స్కాం లో ఏం జరిగిందనేది చూపించబోతున్నారని అర్థం అవుతుంది.

గదినిండా డబ్బు కట్టలతో నిండి ఉన్న సంచులని చూస్తూ కాజల్ అగర్వాల్, ఇది సరిపోతుందా అంటే ఆటిప్పుడే మొదలైందంటూ మంచి విష్ణు చెబుతున్నాడు. అంటే ఈ స్కాం ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెళ్ళుగా కనిపిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ టీజర్లో విష్ణు, కాజల్ తప్ప మరో పాత్ర కనబడలేదు. సో.. వీరిద్దరి చుట్టూ తిరితే కథగా అర్థం అవుతుంది.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. మంచు విష్ణు సొంత నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.

Manchu Vishnu Mosagaallu Teaser released..:

Manchu Vishnu Mosagaallu Teaser released..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ