ఈ రోజు శుక్రవారం ఓటిటి ద్వారా ప్రేక్షకులకు చేరుతున్న రెండు సినిమాల హీరోయిన్స్ పరిస్థితి వారి లక్కేమిటో తేలిపోతుంది. రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమా ఆహాలో గత రాత్రి 7 గంటలకే విడుదలైతే.. నిశ్శబ్దం రాత్రి 12 గంటలకి అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ రెండు సినిమాల్లోని కామన్ పాయింట్ ఏమిటయ్యా అంటే.. ఈ రెండు సినిమాల్లో నటించిన హీరోయిన్స్ క్రేజ్ టాలీవుడ్ లో ఈమధ్యన కనిపించడం లేదు. రాజ్ తరుణ్ సరసన నటించిన హెబ్బా పటేల్ ఫేడవుట్ లిస్ట్ లో ఉండగా.. అసలు మాళవికా నాయర్ కి ఒకటి అరా అవకాశాలు తప్ప సినిమాలే లేవు. వీరిద్దరూ ఒరేయ్ బుజ్జిగా సినిమా హిట్ మీదే ఆశలు పెట్టుకున్నారు. మరి హెబ్బా, మాళవికల లక్కేమిటో ఈరోజు ఫైనల్ గా తేలిపోతుంది.
ఇక అనుష్క నిశ్శబ్దం సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమాలో అనుష్క మెయిన్ లీడ్ లో నటించగా, హీరోయిన్ అంజలి కాప్ గాను, షాలిని పాండే మరో కేరెక్టర్ లో కనిపించనుంది. అయితే అనుష్కనే భాగమతి తర్వాత భారీ గ్యాప్ తో నిశ్శబ్దం సినిమా చేసింది. థియేటర్స్ లో విడుదల కావాల్సిన నిశ్శబ్దం ఓటిటిలో విడుదలవుతుంది. అయితే ఈ సినిమాలో అంజలికి, షాలిని పాండేకి తెలుగులో పెద్దగా క్రేజ్ లేదు. ఈ సినిమా హిట్ అయితే తమ కేరెక్టర్స్ హైలెట్ అయితే తమకి అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు అంజలి, షాలిని పాండేలు.
మరి ఒరేజ్ బుజ్జిగా, నిశ్శబ్దం సినిమాల హిట్స్ పైనే ఈ హీరోయిన్స్ భవిష్యత్తు కెరీర్ ఆధారపడి ఉన్నాయి. చూద్దాం ఈ రెండు సినిమాల టాక్ సోషల్ మీడియాలో ఎలా ఉందో అనేది.