మార్చిలో బంద్ అయిన థియేటర్స్ మళ్ళీ అక్టోబర్ 15 నుండి తెరుచుకోబోతున్నాయి. కరోనా కారణంగా ఎప్పుడు లేనిది థియేటర్స్ మొత్తం మూసుకోవాల్సి వచ్చింది. అసలు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది అని ఎవ్వరు ఊహించనైనా ఊహించలేదు. ఇక కేంద్రం అన్ లాక్ 5.ఓ లో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించింది. అది 50 శాతం పేక్షకులతో అని తెగేసి చెప్పింది. అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యాకే మా సినిమాలను విడుదల చేస్తామంటూ ఓటిటీలకు పడకుండా వెయిట్ చేసిన రామ్, వైష్ణవ తేజ్, ప్రదీప్ మాచిరాజులకు ఈ థియేటర్స్ ఓపెనింగ్ కలిసొచ్చేలానే కనబడుతుంది. రామ్ రెడ్, వైష్ణవ తేజ్ ఉప్పెన, ప్రదీప్ మాచిరాజు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలు ఓటిటి ఆఫర్స్ కి పడకుండా మా సినిమాలు థియేటర్స్ లోనే అంటూ పట్టు పట్టుకుని కూర్చున్నారు.
మరి ఈ నెలలో దసరా కన్నా ముందే థియేటర్స్ తెరుచుకోవడంతో రామ్ రెడ్, ఉప్పెన, ప్రదీప్ సినిమాలు అన్ని థియేటర్స్ లో దిగేలాగే కనబడుతున్నాయి. అయితే ఈ నెల 15 న ఓపెన్ కానున్న థియేటర్స్ ని ఓ 15 రోజులు ఎలా ఉంటాయో చూసాకే తమ సినిమాలను విడుదల చెయ్యాలని ఈ హీరోలు చూస్తున్నారు. 15 నుండి ఓపెన్ కాబోయే థియేటర్స్ కి కేవలం 50 శాతం ప్రేక్షకులే రావాలి. ఆ నిబంధనలు తప్పితే థియేటర్స్ కి నోటీసు లిస్తారు. మరి 50 శాతం ప్రేక్షకులతో తెరుచుకునే థియేటర్స్ లో సినిమాలు విడుదల చేస్తే ఏమాత్రం వర్కౌట్ అవుతాయో అని కూడా హీరోలు ఆలోచిస్తున్నారట. నిజంగానే 50 శాతం ప్రేక్షకులతో థియేటర్స్ లో బొమ్మ పడినా.. అది నిర్మాతలకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది లెక్కలేసుకోవాలి.
అందులోను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్స్ ఓపెన్ అయినా సినిమాల విడుదలకు నిర్మాతలు ఒప్పుకోవడం లేదంటున్నారు. మరి రామ్ రెడ్, ఉప్పెన, ప్రదీప్ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలు థియేటర్స్ లో ఎప్పుడు విడుదల అవుతాయో.. వాటికి వర్కౌట్ అవుతాయో లేదో కానీ.. సాయి ధరమ్ సోలో బ్రతుకే సో బెటరు, చైతు లవ్ స్టోరీ లకు మాత్రం వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే రామ్, వైష్ణవ తేజ్ ల సినిమాల పరిస్థితి చూసాక తమ సినిమాలు థియేటర్స్ కి వదులుతారు సాయి ధరమ్, చైతు వాళ్ళు. ఎందుకంటే ఈ సినిమాలు షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది గనక.