Advertisementt

బాలయ్య ఆలస్యం చేస్తున్నాడెందుకు..?

Thu 01st Oct 2020 10:25 PM
balayya,boyapati srinu,bb3,telugu  బాలయ్య ఆలస్యం చేస్తున్నాడెందుకు..?
Why Balayya taking much time to next..? బాలయ్య ఆలస్యం చేస్తున్నాడెందుకు..?
Advertisement
Ads by CJ

బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ కూడా రిలీజైంది. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. పవర్ ఫుల్ డైలాగ్ తో పాటు బాలయ్య పంచెకట్టు గెటప్ అభిమానులని బాగా ఆకర్షించింది. ఐతే బోయపాటితో సినిమా అనంతరం బాలయ్య ఎవరి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడనేది ఇంకా వెల్లడి కాలేదు.

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పూర్తయ్యాకే మరో సినిమా గురించి ఆలోచించాలని బాలయ్య అనుకుంటున్నాడట. గతంలో ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే తర్వాతి చిత్రాల విషయంలో నిర్ణయం తీసుకునే బాలయ్య, ఈసారి మాత్రం ఆలస్యం చేస్తున్నాడు. గత చిత్రాల వైఫల్యాలే ఇందుకు కారణమని అంటున్నారు.

కథ పూర్తిగా నచ్చాక, ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా ఉందని అనుకుంటేనే ఓకే చెప్పాలని భావిస్తున్నాడట. రూలర్ సినిమా విషయంలో అభిమానులు ఎంతగా నిరాశ చెందారో అందరికీ తెలిసిందే. మరోసారి అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందుగానే అన్నీ క్లియర్ గా అనుకున్న తర్వాతే ఓకే చెప్పాలని చూస్తున్నాడట. అందుకే బాలయ్య నెక్స్ట్ చిత్రం అనౌన్స్ మెంట్ ఇంత ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. 

Why Balayya taking much time to next..?:

Why Balayya  taking much time to next..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ