Advertisementt

పవన్- పూరీ కాంబినేషన్ రిపీట్ కానుందా..?

Thu 01st Oct 2020 10:21 PM
puri jagannadh,pawan kalyan,telugu,vakeel saab  పవన్- పూరీ కాంబినేషన్ రిపీట్ కానుందా..?
Pawan, Puri combo repeat again..? పవన్- పూరీ కాంబినేషన్ రిపీట్ కానుందా..?
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది. ఐతే ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ మరో నాలుగైదు సినిమాలని లైన్లో పెట్టాడు. అధికారికంగా హరీష్ శంకర్ సినిమాతో పాటు క్రిష్ సినిమా ప్రకటన వచ్చింది. ఐతే  ఆ తర్వాత కూడా సినిమాలున్నాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉంటుందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో పూరీ జగన్నాథ్ దర్శకుడిగా మారాడు. బద్రి సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ ప్రయాణం అందరికీ తెలిసిందే. ఐతే ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాతో మరోసారి రిపీట్ అయ్యింది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు.

తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రాబోతుందని వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కి సరిపోయే స్క్రిప్టుని పూరీ జగన్నాథ్ రెడీ చేసాడని, బండ్ల గణేష్ నిర్మాతగా ఈ సినిమా ఉండనుందని వినబడుతుంది. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక సమాచారం లేదు. బాస్ నాతో సినిమాకి ఒప్పుకున్నాడని బండ్ల గణేష్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సినిమా పూరీ జగన్నాథ్ తోనే అయ్యుంటుందని భావిస్తున్నారు. చూడాలి మరేం జరగనుందో..!

Pawan, Puri combo repeat again..?:

Pawan Puri combo repeat again..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ