Advertisementt

అల్లు స్టూడియో అక్కడేనా..?

Thu 01st Oct 2020 06:40 PM
allu studio,allu arjun,allu aravind,allu sireesh,bobby  అల్లు స్టూడియో అక్కడేనా..?
Will Allu studio building at.. అల్లు స్టూడియో అక్కడేనా..?
Advertisement
Ads by CJ

అల్లు రామలింగయ్య 99వ పుట్టినరోజును పురస్కరించుకుని అల్లు కుటుంబం నుండి స్టూడియో నిర్మిస్తున్నామంటూ ప్రకటన వచ్చింది.ఈ మేరకు అల్లు అర్జున్, అల్లు స్టుడియో ప్రారంభిస్తున్నామంటూ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ స్టూడియో నిమిత్తం గండిపేటలో స్థలం చూసారని వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో నిర్మాణ పనులు మొదలవుతాయని సమాచారం. నేటి పూజా కార్యక్రమంలో అల్లు అరవింద్ తో పాటు కుమారులు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ పాల్గొన్నారు. 

టీవీ, సినిమాల నిర్మాణ పనులకి అనుగుణంగా స్టూడియోని నిర్మించనున్నారట. అటు సినిమా నిర్మాతగా కొనసాగుతూ ఉన్న అల్లు అరవింద్, ఆహా యాప్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం స్టూడియో నిర్మాణం ప్రారంభిస్తున్నాడు. ఇవన్నీ చూసుకుంటే సినిమాకి సంబంధించిన ప్రతీ వ్యాపారంలోనూ అల్లు అరవింద్ భాగం ఉన్నట్టే. 

Will Allu studio building at..:

Will Allu studio building at..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ