Advertisementt

బిగ్‌బాస్ సీజన్ 4: ఎవడి గోల వాడిదే..!

Fri 02nd Oct 2020 11:04 PM
bigg boss 4,contestants,irritates,telugu audience,nagarjuna  బిగ్‌బాస్ సీజన్ 4: ఎవడి గోల వాడిదే..!
Bigg Boss Season: Evadi Gola Vadidi! బిగ్‌బాస్ సీజన్ 4: ఎవడి గోల వాడిదే..!
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ అందరూ సీజన్ 3 వరకు ఎపిసోడ్స్‌ని ఫుల్‌గా చూసేసి హౌస్‌లో ఎలా ఉండాలో.. ఎలా ఉంటే హైలెట్ అవుతామో అనే దానిమీద ఫుల్ క్లారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినట్టుగా అడుగడుగునా ప్రూవ్ అవుతూనే ఉంది. మొదటి వారం డల్‌గా ఉన్నారని నాగార్జున చిన్న పిల్లలకి ఇచ్చినట్టుగా ఓ క్లాస్ ఇచ్చాక ఇక హౌస్ మేట్స్ అంతా రెచ్చిపోయి మనుషులు - రోబో టాస్క్‌లో అంతకన్నా ఎక్కువగా కేకల మీద ఫోకస్ పెట్టారు. అందులో మెహబూబ్, సోహెల్ అయితే మరి రెచ్చిపోయి.. తమ ఉనికిని చాటుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు పెద్ద సెలెబ్రిటీస్ కాదని. అందుకే వాళ్ళు గొడవలు, టాస్క్‌లో అరుపులు, కేకలు వేసి టాస్క్ చేస్తే హైలెట్ అవుతామనుకుని వీలున్నప్పుడల్లా హౌస్‌మేట్స్‌తో గొడవలకు దిగుతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్‌లో సోహెల్, మెహబూబ్‌లు దొంగలు, గూండాయిజం చేస్తున్నారు. వాళ్ళలా దొంగతనం చేసి.. గొడవ పడితే ప్రేక్షకులకు మజాగానే ఉంది. కానీ ఒక టైంలో అది శృతి మించి చిరాకు పెడుతుంది. బిగ్ బాస్ ఎన్ని రూల్స్ పెట్టినా ఒక్క హౌస్ మేట్స్ కూడా వాటిని ఫాలో అవడం లేదు. బిగ్ బాస్ పదే పదే హెచ్చరిస్తున్నా ఎవడి ఆట వాడిదే. ఎవరూ మారడం లేదు. ఇక మరో హౌస్‌మేట్ మోనాల్ గజ్జర్ అయితే అనవరసరమైన దానికి గట్టిగట్టిగా ఏడుస్తూ ఇరిటేట్ చేస్తుంది. 

ఇక సోహెల్ మరి గొడవలు పెట్టుకుని అరుపుల స్టార్‌గా పేరు తెచ్చేసుకున్నాడు. అభిజిత్, అమ్మ రాజశేఖర్‌తో ఆల్‌మోస్ట్ కొట్టుకునే స్టేజికి వెళ్లిపోయాడు సోహెల్. ఇక మెహబూబ్, సోహెల్ కంత్రీగాళ్లని నెటిజెన్స్ కి బాగా అర్ధమయ్యింది. ఒకసారి జోష్ గా ఆడిన దివి ఉన్నట్టుండి నెమ్మదిగా మారిపోయింది. ఇక కొంతమంది బ్యాచ్‌ల బ్యాచ్‌లగా గేమ్ ఆడుతున్నారు. అలాంటివాళ్లకి బిగ్ బాస్ నుండి పదే పదే హెచ్చరికలు వచ్చిన హౌస్‌మేట్స్ మాత్రం పట్టించుకున్న పాపన పోలేదు.

Bigg Boss Season: Evadi Gola Vadidi!:

Bigg Boss 4 Contestants irritates Telugu Audience 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ