ప్రస్తుతం కరోనా కటకట మాములుగా లేదు. అందుకే థియేటర్స్ ఓపెన్ అయినా ప్రేక్షకులు రారని ధీమాతో చాలా సినిమాలను ఓటీటీకి అమ్మేసి వదిలించుకుంటున్నారు దర్శకనిర్మాతలు. వడ్డీలు కట్టలేక సినిమాలను ఓటిటీలకు అమ్మేస్తున్నాం అంటున్నారు నిర్మాతలు. అయితే నాని ‘వి’, అనుష్క ‘నిశ్శబ్దం’, రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’, సుహాస్ ‘కలర్ ఫోటో’ చిత్రాలు ఓటీటీల బాట పట్టినా.. యాంకర్ ప్రదీప్ హీరోగా మొట్టమొదటిసారి నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా మాత్రం ఇంకా ఓటీటీనా.. లేదంటే థియేటర్స్‌లోనే విడుదలా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. కరోనా లేకపోతే మార్చిలోనే ఈ సినిమా విడుదలయ్యేది. కానీ హీరోగా ప్రదీప్ పెట్టుకున్న ఆశలన్ని కరోనా వలన ఆవిరయ్యాయి.
అయితే ఎంతమంది ఓటీటీ బాట పట్టినా యాంకర్ ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా నిర్మాతలకు మాత్రం ఆ సినిమాని ఓటీటీకి అమ్మే ఉద్దేశ్యం లేనట్లుగా కనబడుతుంది. మరి ఆ సినిమాలోని నీలి నీలి ఆకాశం నిజంగానే ఆకాశం తాకే క్రేజ్‌తో దూసుకుపోతుంది. కానీ సినిమానే ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు విడుదలవుతుంది చెప్పడం లేదు.
మరి ప్రదీప్ మన సినిమా ఓటిటిలో వద్దు థియేటర్స్‌లోనే అని పట్టుబడుతున్నాడేమో... అందుకే దర్శకనిర్మాతలు ఆగారు. లేదంటే పెద్ద సినిమా నిర్మాతలే తలొగ్గిన ఓటీటీకి ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ నిర్మాత తలొగ్గడా.. ఏదైనా ఈ సినిమా ప్రస్తుతం న్యూస్ లో అయితే కనిపించడం లేదు. మళ్ళీ నీలి నీలి ఆకాశం ఏమైనా రికార్డు కొడితే కానీ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కిన సినిమా సోషల్ మీడియాలో హంగామా చెయ్యదు. లేదంటే ప్రేక్షకులు ఆ సినిమాని మరిచిపోయినా మరిచిపోతారు.