Advertisementt

దేవుడు వరమిచ్చినా పూజారి అన్నట్లుంది బండ్ల స్థితి!

Fri 02nd Oct 2020 10:22 PM
bandla ganesh,pawan kalyan,power star,gabbar singh,devudu,poojari  దేవుడు వరమిచ్చినా పూజారి అన్నట్లుంది బండ్ల స్థితి!
This is the Bandla Ganesh Situation about Film with Pawan దేవుడు వరమిచ్చినా పూజారి అన్నట్లుంది బండ్ల స్థితి!
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా తన దేవుడు పవన్ కళ్యాణ్ తనకి సినిమా చేసే అవకాశం ఇచ్చాడంటూ బండ్ల గణేష్ పవన్‌ని కలిసి వచ్చిన విషయాన్ని ఫొటోతో సహా వైరల్ చేశాడు. దీనితో బండ్ల గణేష్‌తో పవన్ కళ్యాణ్ తన ఐదో సినిమాని ప్రకటించేశాడనే అనుకున్నారు. మరి ఇప్పటికే వకీల్ సాబ్, క్రిష్ మూవీ, హరీష్ శంకర్ మూవీ అలాగే కొత్తగా సురేందర్ రెడ్డి సినిమాలకు కమిట్ అయ్యి ప్రకటన ఇప్పించిన పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాన్ని బండ్ల నిర్మాణంలో డాలీ దర్శకత్వంలో చేస్తాడని అందరూ ఫిక్స్ అవుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన వేరుగా ఉందట. అది పవన్ కళ్యాణ్ లైన్ లోఉన్న సినిమాల్లో వకీల్ సాబ్ అయ్యాక క్రిష్, హరీష్ సినిమాలు చేస్తాడట.

ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని కానీ సురేందర్ రెడ్డి మూవీ చేస్తాడని అయన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం. బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తానని జస్ట్ హామీ ఇచ్చాడు కానీ.. అది ఇప్పుడే అందులోను సురేందర్ రెడ్డి సినిమా తర్వాత అని చెప్పలేదు. కానీ బండ్ల మాత్రం పవన్‌తో తొందరలోనే సినిమా మొదలు పెట్టేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. 

ప్రస్తుతం రాజకీయాలు, వ్యాపారాలు కలిసిరాక మళ్లీ సినిమా నిర్మాతగా మునుపటిలా ఓ వెలుగు వెలుగుదామని బండ్ల డిసైడ్ అయితే హీరోలెవరూ కరిణించడం లేదు. దానితో పవన్‌ని దేవుడు దేవుడు అంటూ వెనకాల పడి సినిమా ఓకే చేయించుకున్నాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో పవన్ చెప్తే కానీ క్లారిటీ రాదు. అంటే దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు అన్నట్టుగా ఉంది బండ్ల పరిస్థితి.

This is the Bandla Ganesh Situation about Film with Pawan:

Again Bandla Ganesh Movie with Power Star Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ