Advertisementt

డ్రగ్స్ కేసు ఎఫెక్ట్ రకుల్‌పై స్టార్టయింది..!

Fri 02nd Oct 2020 09:15 PM
pawan kalyan,krish,rakul preet singh,drugs scandal,rakul  డ్రగ్స్ కేసు ఎఫెక్ట్ రకుల్‌పై స్టార్టయింది..!
Drugs Scandal Effect started on Rakul Preet Singh డ్రగ్స్ కేసు ఎఫెక్ట్ రకుల్‌పై స్టార్టయింది..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సినిమా కాస్త లేట్ అవుతున్న కారణంగా దర్శకుడు క్రిష్ ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ కాంబోలో ఓ చిన్న మూవీని మొదలు పెట్టాడు. ఏకధాటిగా 45 రోజుల షూటింగ్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అయితే రకుల్ ప్రీత్‌ని క్రిష్.. పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎంపిక చేసాడనే టాక్ ఉంది. అయితే ఈలోపు పవన్ సినిమా కాస్త లేట్ అవుతున్న కారణంగా పవన్ మేనల్లుడు వైష్ణవ తేజ్‌తో లో బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో క్రిష్ ఆలోచనలో పడినట్లుగా టాక్. 

ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ని ఎంపిక చేసుకుని పెట్టుకున్నాడు అయితే రకుల్ ప్రస్తుతం డ్రగ్స్ కేసు విషయమై ముంబై లోని ఎన్సీబీ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది. డ్రగ్స్ కేసులో రకుల్ పేరు విపరీతంగా మీడియాలో రాకపోవడానికి కారణం ఆమె ఢిల్లీ హైకోర్టుకెళ్లి మీడియాకి కళ్లెం వేయడమే. అయితే రకుల్ ప్రీత్ ముంబై వెళ్లడం రావడం ఎన్సీబీ ముందు విచారణకు హాజరవడం.. ఎన్సీబీ అధికారులు ఆపై వివరణ ఇవ్వడం చూస్తూనే ఉన్నాము. అయితే ఎన్సీబీ ఎదుట రకుల్ ప్రీత్ తాను డ్రగ్స్ వాడలేదని మొత్తుకుందట. నా ఇంట్లో రియా చక్రవర్తి డ్రగ్స్ దాచుకుంది కానీ... నేను పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని ఎన్సీబీ అధికారులకి చెప్పినట్లుగా తెలుస్తుంది. 

అయితే ఎన్సీబీ మాత్రం రకుల్‌ని అప్పుడే వదలమంటున్నారు. ఎందుకంటే రకుల్‌ని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందట. అందుకే క్రిష్ ఇప్పుడు ఆలోచనలో ఉన్నాడట. రకుల్ ప్రీత్ హీరోయిన్ అయితే సినిమా క్రేజ్‌కి డ్యామేజ్ అవుతుంది అని అందుకే మరో హీరోయిన్‌ని తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడట. మరి రకుల్‌ని తప్పించి క్రిష్ పవన్ కోసం మరో హీరోయిన్‌ని ఎవరిని ఎంపిక చేస్తాడో చూడాలి.

Drugs Scandal Effect started on Rakul Preet Singh:

Rakul Preet Singh doubt in Pawan Kalyan and Krish Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ